దక్షిణాదిలో బాగా అభివృద్ది చెందిన నగరం ఏది అంటే ముందుగా గుర్తొచ్చేది చెన్నై.. ఆంగ్లేయుల కాలం నుంచి ఇది దక్షిణభారతానికి ప్రతినిధిగా ఉంది. సినిమా ఇండస్ట్రీకి కూడా కేంద్రంగా ఉంది. ఇక ఆ తర్వాత స్థానం బెంగళూరుది. సాఫ్ట్ వేర్ రంగంలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న బెంగళూరు క్లీన్ సిటీగా గ్రీన్ సిటీగా పేరు తెచ్చుకుంది.


ఆ తర్వాత స్థానం హైదరాబాద్ ది. ఇది సాఫ్ట్ వేర్ రంగంతో పాటు అనేక రంగాల్లో దూసుకుపోతంది. మరి ఈ మూడు నగరాలను అనుసంధానిస్తూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తే.. దక్షిణ భారతానికే తలమానికంగా ఉంటుందన్నది తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆలోచన. కేంద్ర ప్రభుత్వం వ్యాపార, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల మంత్రుల సమావేశంలో ఆయన ఆ విషయాన్నే నొక్కి వక్కాణించారు.


కేటియార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలను ఈ భేటీలో వివరించారు. పారిశ్రామికీకరణ మరింత వేగంగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై పలు సలహాలు, సూచనలు అందించారు. తెలంగాణ టియస్ ఐ పాస్ ద్వారా మరియు ఇతర పారిశ్రామిక విధానాల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక వర్గాలకు చేయూతని అందిస్తున్న తీరు, దీంతో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరుని తెలిపారు.


హైదరాబాద్ భౌగోళికంగా దేశానికి నడిబొడ్డున ఉన్నదని, ఈ నేపథ్యంలో హైదరాబాద్- బెంగళూరు- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. ఈ కారిడార్ ఏర్పాటు వలన అటు ఐటి రంగంలో దేశంలోనే అగ్రగామిగా నగరాలుగా ఉన్న హైదరాబాద్ బెంగళూరు మరియు పారిశ్రామిక రంగంలో ముందు వరుసలో ఉన్న చెన్నై నగరాన్ని కలిపి ఏర్పాటు చేసే ఈ కారిడార్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.


దీంతోపాటు హైదరాబాద్ నగరంలో ఉన్న ఫార్మా, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగ పరిశ్రమలకు మరింత ఊతం ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న 14 ప్రాధన్యత రంగాల్లో పెట్టుబడులను ఏవిధంగా ఆకర్షిస్తున్నది తెలిపిన కేటిఆర్, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలకు కేంద్రం నుంచి మరింత సహకారం కావాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: