శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసును సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడం జరిగింది. విస్తృత ధర్మాసనానికి నివేదించాలని ఐదుగురు జడ్జిలలో ముగ్గురు జడ్జిలు ప్రతిపాదించారు. దీంతో మెజార్టీ జడ్జిల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పునిచ్చారు. మెజార్టీ జడ్జిల అభిప్రాయంతో జస్టిస్ నారీమన్, జస్టిస్ చంద్రచూడ్ విబేధించారు. ఈ కేసును 3-2తో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. 2018లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై ప్రస్తుతం స్టే ఇవ్వలేదు. దీంతో శబరిమల వివాదానికి నేటితో తెరపడుతుందని ఎదురు చూసిన వారికి నిరాశ ఎదురు అయంది.


ఈ సందర్బంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ ఏమి తెలిపారు అంటే... “రివ్యూతో పాటు అనేక పిటిషన్లు మా ముందుకు వచ్చాయి. ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంది. అన్ని పిటిషన్ల పై విచారించాం. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నాం. మతంలో అంతర్గత విషయం ఏంటి అనేది తేల్చడమే మా పని. మహిళల ప్రవేశ వివాదం ఈ ఒక్క ఆలయానికే పరిమితం కాలేదు. దీని పై ఇంకా చర్చ జరగాల్సి ఉంది. మసీదుల్లో మహిళల ప్రవేశం కూడా చర్చకు వచ్చింది. మతంలో కలుగజేసుకునే అధికారం కోర్టుకు ఉందా లేదా అని కూడా చర్చించాం. మెజార్టీ తీర్పుతో మత విశ్వాసాలను తక్కువ చేయడం తగదు. శబరిమలలోకి మహిళల ప్రవేశం పై ఇప్పుడు నిషేధం విధించలేం.”  అని తెలిపారు.


2018 సెప్టెంబర్ 28న శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 సంవత్సరాల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అనంతరం కేరళ ప్రభుత్వం సుప్రీం తీర్పును అమలు చేస్తూ మహిళల ప్రవేశానికి అనుమతిచ్చింది. దీంతో హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది పెద్ద వివాదంగా మారింది. దీంతో హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తులు రివ్యూ పిటిషన్ ను కోరుతూ సుప్రీంలో పిటిషన్ వేశాయి. దీని పై అప్పటి నుంచి విచారణ కోనసాగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: