ఏపీ సీఎం జగన్ ఉద్యోగ వర్గాన్ని బాగానే చూసుకుంటున్నారు. ఇప్పటికే పలు రకాల ఉద్యోగులకు జీతాలు పెంచారు. తాజాగా మరికొందరికి వేతనాలు పెంచారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఏరియాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఆశావర్కర్లకు భారీగా వేతనం పెంచారు. గతంలో వీరికి రూ.400 మాత్రమే వేతనం వచ్చేది. ఇప్పుడు దాన్ని ఏకంగా రూ. 4000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

 

రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న ఈ నిర్ణయానికి బడ్జెట్‌ కూడా కేటాయించడం జరిగింది. రూ.14.46 కోట్లు కేటాయించడం జరిగింది. దీని ద్వారా సుమారు 2652 మందికి లబ్ధిచేకూరుతుంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరించారు.

 

రాష్ట్రంలో కొత్త బియ్యం కార్డులు జారీ చేయాలని, గతంలో ఉన్న ఆదాయ పరిమితులను పెంచుతూ గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు వచ్చే వారు అర్హులు. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ. 12 వేలు సంపాదించే వారు అర్హులుగా కేబినెట్‌ తీర్మానం చేయడం జరిగింది. ఫీజురియంబర్స్‌మెంట్‌ పథకానికి రూ.2.50 లక్షలు, ఆరోగ్యశ్రీ కార్డు పొందేందుకు రూ.5 లక్షల వార్షిక ఆదాయం లోబడి ఉండాలి. కార్డులు అచ్చు వేయడానికి రూ.20 కోట్లు మంజూరు చేస్తూ సివిల్‌ సప్లయ్‌ డిపార్టుమెంట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

 

 

అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్‌ సదన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీని రెండుగా విభజించాలని, సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీగా కొత్తగా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా బ్యాంకుల నుంచి రుణాల స్వీకరణకు కేబినెట్‌ ఆమోదించింది. ఇలాంటి పలు కీలక నిర్ణయాలు కేబినెట్ మీటింగ్ లో తీసుకున్నారు జగన్.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: