
ప్రపంచంలో అత్యధిక మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీని నుంచి బయటపడేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ, ఊబకాయం నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. ఇక మనదేశంలో ఈ సంఖ్య రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నది. బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సఫలం కావడం లేదు. కారణాలు ఏంటి అన్నది మాత్రం తెలియడం లేదు. ఎంత ప్రయత్నించినా... ఫలితం మాత్రం శూన్యం అని చెప్పాలి.
ఇదిలా ఉంటె, ఊబకాయం నుంచి బయటపడటాని పాపం ఉదయాన్నే లేచి జాగింగ్,వాకింగ్ ఇంకా ఇతర పనులు చేస్తుంటారు. అయితే, బెల్జియంకు చెందిన శాస్త్రవేత్తలు ఓ ఈస్ట్ ను కనుగొన్నారు. ఆ ఈస్ట్ వలన శరీరంలోని బరువు తగ్గుతుందని అంటున్నారు. ఆ ఈస్ట్ ఇప్పుడు బెల్జియంలో తయారయ్యే బీర్లలో దొరుకుతుంది. ఆ బీర్లు రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే చాలు.. బొజ్జలు రావడం కాదు.. బొజ్జలు కరిగిపోతాయని అంటున్నారు.
అయితే, ప్రపంచంలో దొరికే అన్ని రకాల బీర్లలో ఈ రకమైన ఈస్ట్ ఉంటుందా అంటే ఉండదనే అంటారు. బ్యాక్తీరియా, ఈస్ట్ లు మిశ్రమంగా కలవడం వలనే ఇలా సాధ్యం అవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బెల్జియంకు చెందిన హోగార్డెన్, వెస్ట్‌మల్లే ట్రిపల్, ఎట్ క్రైకెన్‌బియర్ బ్రాండ్ల బీర్లలో ఈ మంచి గుణాలు ఉన్నాయట. ఆ బీర్లు రెండుసార్లు, భూగర్భంలో ఉండగా ఒకసారి, సీసాలో మరోసారి బీరు పులియడం వల్ల వాటికి ఆ మంచి గుణాలు అబ్బాయట. భూగర్భంలో పులియడానికి ఒకరకమైన ఈస్ట్, సీసాలో పులియడానికి మరో రకమైన ఈస్ట్‌ను ఉత్పత్తిదారులు ఉపయోగిస్తున్నారని, ఈ రెండోసారి పులియడంతోనే బీరులో ఎక్కువగా ఆరోగ్య లక్షణాలు చేరుతున్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
మరి మన దగ్గర ఈ బీర్లు దొరుకుతాయా అంటే ఖచ్చితంగా దొరుకుతాయని అనాలి. అయితే, వాటికోసం శోధించి పరిశోధించాలి. ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోగలిగితే మంచిది. ప్రపంచంలోని ఊబకాయుల్లో అత్యధిక శాతం మంది మనదగ్గరే ఉన్నారు. మనదగ్గర కూడా ఇలా రెండుసార్లు పులియబెట్టిన బీర్లు దొరికితే బాగుంటుంది. అయితే, మనదగ్గర అలా చేయడానికి సమయం ఎక్కడుంది. అక్కడ రెడీ అయ్యి బీరు బయటకు వచ్చిన వెంటనే అయిపోతున్నాయి. అక్కడంటే జనాభా తక్కువ కాబట్టి సాధ్యం అవుతున్నది.