దిశ దారుణ అత్యాచారం, హత్య తర్వాత సమాజం నుంచి తీవ్ర నిరసన ఆందోళన వచ్చిన విషయం తెలిసిందే. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు.. ప్రజల పెద్ద ఎత్తున పోగై.. రేపిస్టులను తమకు అప్పగిస్తే అంతు చూస్తామని చెప్పారు కూడా. అయితే దిశ రేపిస్టులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇప్పుడు ఆ ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్ సీ విచారణ జరుపుతోంది.

 

అయితే దిశ రేపిస్టుల ఎన్‌ కౌంటర్ గురించి దిశ కుటుంబానికి ముందే పోలీసులు సమాచారం ఇచ్చి ఉంటారని ఎన్ హెచ్ ఆర్సీ బృందం అనుమానిస్తోంది. తాజాగా దిశ కుటుంబాన్ని ప్రశ్నించి ఈ బృందం ఈ విషయంపై గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

 

హత్యాచారానికి గురైన దిశ కుటుంబ సభ్యులకు... ఆదివారం తమ ముందు హాజరు కావాలంటూ కమిషన్‌ బృందం కబురరు పంపింది. సాయంత్రం దిశ తండ్రి, సోదరి తెలంగాణ పోలీస్‌ అకాడమీకి వచ్చారు. ఈ ఎన్‌కౌంటర్‌ గురించి మీకు ముందే తెలుసా? మీకేమైనా సమస్యలున్నాయా? అంటూ వారిని దాదాపు గంటసేపు పాటు వివిధ కోణాల్లో కమిషన్ ప్రశ్నించింది. సమాచారాన్ని సేకరించింది.

 

అయితే ఈ ఎన్‌కౌంటర్‌ గురించి టీవీల్లో చూసిన తర్వాతే మాకు తెలిసింది. పోలీసుల నుంచి ముందస్తు సమాచారం లేదు’ అని దిశ కుటుంబ సభ్యులు వివరించినట్టు తెలుస్తోంది. అయితే కమిషన్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఆదివారం దిశ కుటుంబ సభ్యులు వారి ఇంట్లో ఆమె దశదిన కర్మను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉండగానే ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పిలుస్తోందంటూ పోలీసులు హడావుడి చేశారు. అసలే బాధలో ఉన్న తమను కమిషన్ వేధిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: