ఈ మధ్య కేంద్రం, రాష్ట్రం అమలు చేస్తున్న చాలా పథకాలకు ఆధార్ కార్డ్ ఉంటే మాత్రమే అర్హత పొందుతున్న విషయం తెలిసిందే. కొన్ని పథకాలు మాత్రం ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా అమలవుతున్నాయి. తాజాగా కేంద్రం మతకలహాలలో గాయపడిన వ్యక్తులకు, ఉగ్ర దాడులలో గాయపడిన వ్యక్తులకు లేక కుటుంబీకులకు కేంద్రం అందించే ఆర్థిక సహాయం పొందాలంటే ఆధార్ తప్పనిసరి అని ప్రకటించింది.
 
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి ఈ మేరకు ప్రకటన విడుదల అయింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో భారత సరిహద్దుల్లో కాల్పుల, పేలుళ్ల బాధితులు, మతకలహాల బాధితులు, నక్సల్ దాడి బాధితులు, ఉగ్ర దాడిలో గాయపడిన వారు లేదా వారి కుటుంబీకులు ప్రభుత్వం అందించే పథకానికి అర్హులు కావాలంటే తమ ఆధార్ గుర్పింపును సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 
 
ఎవరైనా ఈ పథకం కింద అర్హులై ఉండి ఆధార్ గుర్తింపు సంఖ్య లేకపోతే ఆధార్ గుర్తింపు సంఖ్య కోసం ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాలకు మాత్రం ఈ పథకం వర్తించదని తెలుస్తోంది. మేఘాలయ, అసోం రాష్ట్రాలకు మాత్రం ఈ పథకం వర్తించదని తెలుస్తోంది. ఆ రెండు రాష్ట్రాలలో ఆధార్ నమోదు ఇంకా పూర్తి కాలేదని అందువలనే ఈ పథకం అక్కడ వర్తించదని చెబుతోంది. 
 
అర్హులైన వారికి ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పథకాలను వర్తింపజేస్తాయని తెలుస్తోంది. ఆ రాష్ట్రాల నుండి కేంద్రానికి ప్రతిపాదనలు అందినప్పుడు రాష్ట్రాలకు కేంద్రం ఆ మొత్తాన్ని అందిస్తుందని సమాచారం. ఈ రెండు రాష్ట్రాలు మినహా మిగతా 27 రాష్ట్రాలకు ఈ పథకం వర్తించనుంది.  ఈ పథకం ద్వారా భారీగా ఉగ్రదాడులలో, మత కలహాలలో గాయపడిన వ్యక్తులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకానికి అర్హులై ఆధార్ గుర్తింపు సంఖ్య లేని వారు ఆధార్ కొరకు ధరఖాస్తు చేసుకొని ఈ పథకానికి అర్హత పొందవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: