ఐశ్వర్యానికి సంబంధించి ఒక వ్యక్తిని విలువ కట్టాలి అంటే అతడి సంపదనను అంకెలలో లెక్కకట్టడం అనాది నుండి ఆచరణలో ఉంది. మనం డబ్బు సంపాదించాలి అని ఏర్పరుచుకున్న వాంఛను నిజం చేసుకోవడానికి ఆరు సూత్రాలు ఖచ్చితంగా అవలంభించి తీరాలి అని చెపుతూ ఉంటారు.

ఈ సూత్రాలలో మొదటిది మనం ఖచ్చితంగా ఎంత డబ్బు సంపాదించాలి అని కోరుకుంటున్నామో దానికి సంబంధించి ఒక స్థిర నిర్ణయం ఉండాలి. అదేవిధంగా ఆ డబ్బులు సంపాదించదానికి మనం చెప్పించబోయే మూల్యం ఏమిటో క్లారిటీ ఉండాలి. రూపాయి ఖర్చు లేకుండా ఐశ్వర్యం రాదు.


ఇక ఈ విషయంలో మూడవ సూత్రం మనం కోరుకుంటున్న డబ్బును మన జీవితంలో ఎన్ని సంవత్సరాలలో సంపాదించాలో స్పష్టమైన క్లారిటీ ఉండాలి. దీనికోసం స్పష్టమైన ఒక ప్రణాళిక కూడా ఉండాలి. ప్రణాళిక లేకపోతే ఐశ్వర్యం రాదు. అదేవిధంగా మనం సంపాదించాలి అని కలలు కంటున్నా డబ్బును అంకెలలో స్పష్టంగా ఒక తీర్మాన రూపంలో వ్రాసి పెట్టుకుని ఆ డబ్బుకు బదులుగా మనం ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నామో స్పష్టంగా క్లారిటీతో ఉండాలి.


రోజుకు రెండు సార్లు నిద్రకు ఉపక్రమించే ముందు ఉదయాన్నే నిద్ర లేవగానే ధనం సంపాదించే విషయంలో మనం వ్రాసి పెట్టుకున్న తీర్మానాన్ని మనసులో ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ మనకు మనం ప్రతిభావంతులం అని ఊహించుకోవాలి అలా ఊహించుకున్నప్పుడు మాత్రమే మన స్వర్ణమాయ ఆలోచనలు నెరవేరుతాయి. దీనికోసం మనకు మనమే కోటీశ్వరుడు గా ఊహించుకోవాలి. అయితే కేవలం ధనం కోసం ఆరాటపడుతూ కలలు కన్నంత మాత్రాన ఏ వ్యక్తి ధనవంతుడు కాలేడు. మనం నమ్మిన విషయాన్ని మనసా వాచా కృషి చేస్తూ ఎదురు దెబ్బలు ఎదురైనా పట్టుదల కోల్పోకుండా మనం కోరుకున్న డబ్బు ను సంపాదించే విషయంలో మన యాక్షన్ ప్లాన్ పరిస్థితులను బట్టి మార్చుకుంటూ పోవాలి. ఇలా ఆరు సూత్రాలను అమలు చేయగల వ్యక్తి మాత్రమే సంపదను పొందగలడు..

మరింత సమాచారం తెలుసుకోండి: