ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఎన్నో దేశాల్లో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది.. దాంతో పాటే మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది.  మధ్య అమెరికా దేశం పనామా చాలా కఠినమైన నిర్బంధాన్ని ప్రకటిస్తూ, ప్రజల కదలికలను లింగం ఆధారంగా విభజించింది. పనామాలో ఇప్పటికి 1000కి పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టాడానికి ప్రపంచంలోని వివిధ దేశాలు రక రకాల పద్ధతులని అవలంబిస్తున్నాయి. కొన్ని చోట్ల తీవ్ర నిర్బంధం విధిస్తే, కొన్ని చోట్ల సడలింపు చేస్తున్నారు.. అయితే కండీషన్లు అప్లై అంటున్నారు. వందకు పైగా దేశాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు.

 

కొన్ని దేశాల్లో ఆంక్షలు వింతగా ఉన్నా, ‘అంతా మన మంచికే’ అని జనం సరిపెట్టుకుంటున్నారు.  పనామాలో లాక్‌డౌన్ సడలింపు నిబంధనలు సరదాగా ఉన్నాయి. ఆడవాళ్లను, మగవాళ్లను రోజు మార్చి రోజు బయటికి అనుమతిస్తున్నారు. సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో ఆడవాళ్లు బయటికి వెళ్లొచ్చు. మంగళవారం, గురువారం, శనివారం మగవాళ్లు తిరగొచ్చు.  అయితే ఆదివారం మాత్రం ఎవరూ బయటకు రావడానికి వీలు లేదని తెల్చి చెప్పారు.  మిగతా రోజుల్లో కూడా కేవలం రెండు గంటలు మాత్రమే బయటికి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

 

టునీసియాలో అయితే వైద్యచికిత్స కోసం తప్ప బయటికి అడుగుపెట్టనివ్వడం లేదు. మరేదైనా పనిపై బయటికి వెళ్లాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. రోడ్లపై ఎవరూ తిరగకుండా ఆటోమేటిక్ రోబోలతో కాపలా కాయిస్తున్నారు.  అంతే కాదు పోలీసులు కూడా ఎవరు కనిపించినా వారి పట్లా నానా యాగీ చేస్తున్నారు.  దాంతో ఎవరు బయటకు రావడానికి సాహసించలేకపోతున్నారు. ఇలా ఒక్కో దేశంలో ఒక్కో విధంగా లాక్ డౌన్ విషయంలో నియమాలు పాటిస్తున్నారు. అయితే మన దేశంలో మాత్రం కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం యదేచ్చగా ఉల్లంఘనలు సాగుతున్నాయి.. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: