ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా రక్కసి గురించి ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముందుగా అనుకున్న అనేక విషయాలు ఇప్పుడు తప్పు అని కూడా రుజువవుతున్నాయి. అయితే కొత్తగా సైంటిస్టులు గమనించిన ఓ విషయం ఇప్పుడు ఇండియాకు బిగ్ గుడ్ న్యూస్ కాబోతోంది.

 

 

అదేమిటంటే.. ఇప్పటివరకూ కరోనా వైరస్ ఎలాంటి ఉపరితలంపైనేనా గరిష్టంగా 18 గంటల వరకూ బతికి ఉంటుందని అంటున్నారు. అయితే తాజాగా చెబుతున్న విషయం ఏంటంటే.. కరోనా వైరస్ అనేది 36డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతలో ఏమాత్రం బతకలేదట. 36 డిగ్రీల పై స్థాయి ఉష్ణోగ్రత‌లో క‌రోనా వైర‌స్ పూర్తిగా న‌శించిపోతుంద‌ట. ఉష్ణోగ్రత 36 డిగ్రీల‌ను దాటిందంటే.. ఏదైనా త‌లం మీద అయినా వ‌స్తువు మీద అయినా.. క‌రోనా వైర‌స్ నిమిషాల్లోనే చచ్చిపోతుందట.

 

 

అయితే ఇదేమీ కొత్త విషయం కాదు. మొదటి నుంచి కరోనా ఉష్ణోగ్రతలో బతకదనే సైంటిస్టులు చెప్పారు. కానీ మొదట్లో ఇది 26 డిగ్రీలు దాటితే బతకదని చెప్పారు. కానీ అనేక ఉష్ణ మండల దేశాల్లోనూ కరోనా విజృంభించింది. తాజా పరిశోధనల ప్రకారం కరోనా 36 డిగ్రీలు దాటితే నశిస్తుందట. ఇప్పుడు ఇండియాలో అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల వరకూ ఉంటున్నాయి. అందువల్ల ఇండియాలో కరోనా వ్యాప్తి అంత వేగంగా జరిగే అవకాశం లేదు.

 

 

భారత్ లోని అధిక ఉష్ణోగ్రతల కారణంగా కరోనా చైన్ సులభంగా తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గి.. కేసుల సంఖ్య కూడా అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది మళ్లీ వర్షాకాలం వస్తే విజృంభించే ప్రమాదం లేకపోలేదు. ఈలోపే దీన్ని దేశం నుంచి తరిమేయాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: