కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో వచ్చే అన్ని పోస్టులు గుడ్డిగా నమ్మకండి.. తాజాగా నిమ్స్ వైద్యులు ఈ మేరకు కరోనా వైరస్ గురించి వివరణ ఇచ్చారు. ఆ సమాచారం ప్రకారం .. కరోనా వైరస్ బీటా కరొనా కుటుంబానికి చెందింది. మిగతా వైరస్ కంటే ఈవైరస్ బరువు ఎక్కువ. స్వైన్ ఫ్లూ కంటే వేగంగా విస్తరిస్తోంది. తలనొప్పి, జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటె కరోనా వైరస్ సోకినట్టుగా గుర్తించవచ్చు.

 

 

కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత దగ్గు వస్తుందని, ఈ దగ్గు ఒక్కోసారి గంట వరకు ఉంటుందని తెలిపారు. జ్వరం తలనొప్పి కూడా వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయి. ఈ లక్షణాలు ఉంటె కరోనా వైరస్ వచ్చినట్టే. సెంట్రల్ ఏసీలకు దూరంగా ఉండాలి. డిస్చార్జ్ అయిన తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లోనే ఉండాలి.

 

 

న్యూస్ పేపర్, పాల పాకెట్ల వాడకం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్లాస్టిక్, స్టీల్, వంటి వస్తువులు పై వైరస్ ఎక్కువ కాలం ఉంటుంది. ఎక్కువ సార్లు చేతులను శుభ్రంగా కడగాలి. క్వారంటైన్ కాలం పొడగించటం వల్ల బాధితులకు మరింత మేలు చేకూరుతుంది. కరోనా వ్యాధి వచ్చి తగ్గిన వారు డిశ్చార్జ్ ఆయిన తర్వాత కూడా 14 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాలి.

 

 

చంటి బిడ్డలకు తల్లి పాలు ఇస్తే వైరస్ సోకే ఆస్కారం లేదు. కరోనా వ్యాధి వలన చనిపోయే వారి సంఖ్య కూడా చాలా తక్కువ. వైద్యుల సలహా మేరకే క్లోరోక్విన్ వాడలే తప్ప ఇష్టం వచ్చి నట్లు వాడితే వేరే ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. వయస్సు లో పెద్ద వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు తప్పనిసరిగా భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు సమతుల్య ఆహారం తో పాటు వ్యాయామం , యోగ, ధ్యానము లాంటి చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: