కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో చాలా సమాచారం చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో కాపీ పేస్టుల వల్ల ఆ సమాచారం మూలం ఏదో అర్థం కాదు. అందువల్ల కనిపించిన ప్రతి సమాచారాన్ని నమ్మకూడదు. ఇక కరోనాపై అనేక పుకార్లు, వదంతులు, అర్థ సత్యాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒక దాని గురించి ఇప్పుడు చూద్దాం..
కరోనా వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందన్న ప్రచారం కూడా ఉంది. గతంలో అనేక ప్రాణాంతక జబ్బులకు దోమ ఒక వాహకం. దోమల ద్వారా అనేక రోగాలు వ్యాపించాయి. అనేక మరణాలకు కూడా దారి తీశాయి. అయితే కరోనా వైరస్ కు సంబంధించి మాత్రం దోమ ఒక వాహకం కాదు. అంటే దోమల ద్వారా.. దోమ కాటు ద్వారా కరోనా వైరస్ వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. ఇప్పటి వరకూ దోమల ద్వారా కరోనా వ్యాప్తి చెందినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
మరి కరోనా వైరస్ ఎలా వస్తుంది.. కరోనా వైరస్ కరోనా పాజిటివ్ ఉన్న రోగి తుంపర్లు, కళ్లె, స్పర్శ ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. ఇంతకు మించి వేరే మార్గాల్లో కరోనా వచ్చే అవకాశం లేదు. అంటే కరోనా రోగి సమీపంలోకి వెళ్తేనే మనకు కరోనా వస్తుందన్నమాట. కరోనా రోగితో మాట్లాడినా.. ఆయనకు ఒక మీటరు దూరంలో ఉన్నా.. కరోనా రోగితో కరచాలనం చేసినా కరోనా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
అందుకే కరోనా బారిన పడకుండా ఉండేందుకు తరచూ చేతులు కడుక్కోవాలని చెబుతున్నారు. దీని ద్వారా కరోనా వైరస్ నశిస్తుంది. ఈ కరోనా వైరస్ మన కళ్లు, ముక్కు, నోరు ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. సో.. దోమల ద్వారా కరోనా వస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి