సినిమాల్లో కమెడియన్ పాత్రలు చేస్తూనే రాజకీయాల్లోకి అడుగు పెట్టి చేతులు కాల్చుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండ్ల ఆసమయంలో మీడియాకు కు పూర్తిగా దొరికిపోయారు. చివరకు ఆయనను ఒక రాజకీయ జోకర్ గా మీడియాలో పాపులర్ అయ్యాడు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న బండ్ల పూర్తిస్థాయిలో సొంత వ్యాపారాల కోసమే వెచ్చిస్తున్నారు. ఇక కరోనా ప్రభావం మొదలైన దగ్గర నుంచి ఆయన తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ట్విట్స్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను టార్గెట్ చేసుకుని బండ్ల గణేష్ ట్విట్స్ చేయడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. నారా లోకేష్ ఒక ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడు అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు .

 


' గౌరవనీయులైన నారా లోకేష్ గారికి ప్రేమతో.. రాజకీయాలు అంటే నాకు చాలా ఇష్టం. కానీ అది చాలా కష్టం అని వదిలేసా. రాజకీయ నాయకుడి లక్షణాలు దమ్ము, ధైర్యం ప్రజల్లో నమ్మకం, పోరాడుతాడు అన్న విశ్వాసం కల్పించడం. ఈ ప్రపంచంలో అతి కొద్ది మందికి మాత్రమే దక్కే అదృష్టం మీకు దక్కడం నిజంగా మీ అదృష్టం. చంద్రబాబు నాయుడు కుమారుడు గా మీ అదృష్టం. రాజకీయ పార్టీ అంటే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ కాదు. మన దగ్గర మన పార్టీ పార్టీలో నాయకులు అందరూ మన దగ్గర ఎంప్లాయిస్ కాదు. ప్రతి ఒక్కరినీ ప్రేమించి, ప్రేమను పంచి మనలో ఒకరిగా చేసుకుని, ప్రజలకు సేవ చేయాలని అనుకుంటాను. 

 


మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే మీ తండ్రి మీ గురించి గర్వంగా నిద్రపోయే రోజు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య ట్విట్టర్లో మీరు చేసిన కామెంట్లు మిమ్మల్ని ఇష్టపడేవారు చాలామంది బాధపడుతున్నారు. మీరు అద్భుతంగా పనిచేసి ప్రజలలో నారా లోకేష్ తండ్రి చంద్రబాబు అని చెప్పుకునే విధంగా మీ రాజకీయం ఉండాలని, మీరు ఆ విధంగా ప్రజా పోరాటం లో భాగం కావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి  సమకాలికుడు గా పనిచేసిన ఆయన మంత్రివర్గంలో పనిచేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ లాగ  ఉండాలి.

 

నాకిష్టమైన రాజకీయ నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు తన నలభై ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో విజయాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతూ ఉంటారు. తండ్రి చనిపోయిన తర్వాత ప్రత్యర్ధులు అందరూ ఒకటే ఇబ్బడిపెట్టాలని చూసినా వారిని ఎదిరించి తొమ్మిది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాడి ఘన విజయం సాధించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి లా ఉండాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తోంది. రాజకీయాల్లో పట్టు సాధించలేరని. కానీ మీరు నెంబర్ వన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఏ విధంగా తయారయ్యారో మీరు కూడా ఆ విధంగానే తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.

 

మొన్నీమధ్య తిరుపతి దేవస్థానం చైర్మన్ స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వస్తే మీరు చేసిన ట్విట్స్ మీ దిగజారుడుతనానికి. రాజకీయ నాయకులకు 3 కావాలి 1 వాళ్లపై వాళ్ల నమ్మకం రెండు వారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు నమ్మి రావడం. మూడు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరినీ మీరు నమ్మడం. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఎవరి తో అనుబంధం లేదు. కానీ మీరంటే మీ నాన్న గారు అంటే నాకు గౌరవం.మీ తాత గారు అంటే నాకు ఎంత ప్రేమో. అందుకోసమే మీకు ఈ విన్నపం.ఎవరు ఏ విధమైన సపోర్ట్ చేయకపోయినా నెంబర్ వన్ పొజిషన్ వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా మీరు ఉండాలి. చంద్రబాబు నాయుడు కుమారుడుగా తప్ప రాజకీయంగా మీకు ఏ అర్హత లేదు. ఎందుకంటే నాకు తెలిసి మీరు ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడు. ప్రేమతో మీ బండ్ల గణేష్ అంటూ అనేక ట్విట్స్ చేసి రాజకీయ కాక లేపారు బండ్ల గణేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: