ఒకప్పుడు సమాజంలో దారి దోపిడీలు ఉండేవి దారి వెంట వెళ్ళేవాళ్ళని అడ్డుకొని బలవంతంగా వారి వద్ద నుంచి సొమ్మును దోచుకొని వెళ్లిపోయేవాళ్ళు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. చేతికి మట్టంటకుండా బుర్ర ను ఉపయోగించి మోసం చేసి సొమ్ములతో వుడాయిస్తున్నారు. నమ్మించి మోసం చేయడం ఈ మధ్య ఒక పాషన్ గా మరిపోయింది. కొంతమంది అయితే అదే వృత్తిగా ఎంచుకుంటున్నారు కూడా. మోసగాళ్ళు ఎక్కడనుంచో రారు మన చుట్టూనే ఉంటారు అనడానికి సరైన ఉదాహరణ ఈ సంఘటన. ఎక్కడో పరిచయం అయ్యాడు కష్టాలు వచ్చినపుడు ముందుకొచ్చి నీకు నేను తోడుగా ఉంటా అన్నాడు అంతే ఆమె పొంగిపోయింది. అక్కడితో ఆగకుండా తన వ్యాపారాలలో వాటా ఇస్తానని నమ్మబలికాడు నెమ్మదిగా ఆమె దగ్గర నుండి 6 లక్షలు క్యాష్, కారు, బైక్ తీసుకున్నాడు. కట్ చేస్తే మర్నాడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఆమెకి మ్యాటర్ అర్థమైంది లబోదిబో మంటూ పోలీస్ స్టేషన్ కు పరుగెత్తింది.
వివరాల్లోకి వెళ్తే.... చెవ్వేటి దివ్యవాణి ఇద్దరు పిల్లలతో సంజీవిగిరి కాలనీలో నివాసం ఉంటోంది. ఆమె భర్త సోనీదత్ ఉద్యోగ రీత్యా ముంబయిలో ఉంటున్నాడు. ఆమె వికాస్‌నగర్‌లో రెండేళ్ల క్రితం ఆమె ఓ పాఠశాలను ప్రారంభించింది. అందులో నష్టాలు రావడంతో ఫైనాన్స్ కోసం చూస్తుండగా మోటూరి అప్పలరాజు అలియాస్ అఖిల్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు.
ఆర్థికంగా ఆదుకుంటానని, తనకు ఐరన్ వ్యాపారం ఉందని అందులో వాటా ఇస్తానని దాంతో నువ్ అప్పుల నుంచి గట్టెకొచ్చని నమ్మించాడు. దీంతో ఆమె తన తండ్రి నుంచి డబ్బులు తీసుకుని అతనికి రూ.6లక్షల ఇచ్చింది. అనంతరం ఆమె కారు, సోదరుని ద్విచక్ర వాహనం కూడా ఇచ్చింది. నగదు, వాహనాలతో మోటూరి అప్పలరాజు వుడాయించాడు. మరుసటి రోజు నుంచి అతని ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎంత ప్రయత్నించినా అసలు ఆచూకీ దొరకలేదు.తెలిసిన చోట్లా గాలించినా లాభం లేకపోయింది. దీంతో చేసేదేమీ లేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. సీఐ పైడపునాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి