తెలంగాణలో కరోనా భయంకరంగా విజృంభిస్తోంది. రోజూ కనీసం 600కుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక సోమవారం అయితే ఆల్ టైమ్ హై రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. సోమవారం ఏకంగా 872 కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒకరోజు నమోదైన కేసుల్లో ఇదే సరికొత్త రికార్డు కావడం విశేషం.

 

 

అంతే కాదు.. ఈ కేసుల్లో అత్యధికం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉండటం కలకలం రేపుతోంది. సోమవారం కూడా అత్యధికంగా 713 కేసులు ఒక్క జీహెచ్ ఎంసీ పరిధిలోనే వచ్చాయి. అంటే తెలంగాణలో దాదాపు 90 శాతం కరోనా గ్రేటర్ హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయన్నమాట. హైదరాబాద్ పక్కనే ఉన్న రంగారెడ్డిలోనూ కోరనా ప్రభావం దారుణంగానే ఉంది. సోమవారం ఇక్కడ 107 మందికి వైరస్ సోకింది.

 

 

సోమవారం కేసులతో కలిపి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బాధితుల సంఖ్య 8,674కు చేరింది. అయితే కేవలం రెండు రోజుల్లోనే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 7 వేల నుంచి 8 వేలకు చేరుకుంది. గత నాలుగు రోజులుగా రోజూ కనీసం 500 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈనెల 19499 కేసులు నమోదయ్యాయి. ఆ మరుసటి రోజు 546 కేసులు వచ్చాయి. ఇక ఆదివారం ఈ సంఖ్య ఏకంగా 730కు ఎగబాకింది. సోమవారం ఆల్ టైమ్ హైగా 872 కేసులు వచ్చాయి.

 

 

ఈ కేసుల సంఖ్య చూస్తుంటే తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో కరోనా విపరీతమైన వేగంతో వ్యాప్తి చెందుతోందని తెలుస్తోంది. అందులోనూ తెలంగాణలో పరీక్షలు తక్కువగా చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. మరి తక్కువ పరీక్షలు చేస్తేనే ఇన్ని కేసులు చేస్తే..ఇక పరీక్షల సంఖ్య 10 వేలు దాటితే ఎన్ని కేసులు బయటపడతాయో తలచుకుంటేనే భయంగొలుపుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: