ఒకవైపు తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతూ ఉంటే మరోవైపు హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని  ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ కలహాలతో మామని అల్లుడు అతి దారుణంగా కొట్టి చంపిన సంఘటన నల్గొండ పోలీస్ అధికారులు ఛేదించారు. తన కూతురిని ఎందుకు కొడుతున్నావు అని అడగడంతో ఆగ్రహానికి గురైన అల్లుడు మామను రోకలిబండతో కొట్టి హత్య చేసినట్లు పోలీస్ అధికారులు నిర్ధారించారు. 

 

 

పూర్తి వివరాల్లోకి వెళితే... నల్గొండ పట్టణానికి చెందిన గోపి అనే వ్యక్తి కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వెంకటలక్ష్మి తో పెళ్లి జరిగింది. ఇక ఇటీవల వీరి కుమారుడు అయిన రిత్విక్ పుట్టు వెంట్రుకల కార్యక్రమానికి వెంకటలక్ష్మి తండ్రి వెంకటేశ్వర్లు ఆమె సోదరుడు ప్రకాష్ రావడం జరిగింది. ఇక అదే రోజు ప్రకాష్ తిరిగి నందిగామకు వెళ్ళిపోయాడు. ఇక కూతురు అల్లుడుని ఇంటికి తీసుకెళ్లేందుకు మామ ఆరోజు అక్కడే ఉన్నాడు. ఇక మరుసటి రోజు మామ అల్లుడు ఇద్దరూ కలిసి ఫుల్లుగా మద్యం సేవించి ఎంజాయ్ చేసారు కూడా. ఇక మద్యం మత్తులో జరిగిన చిన్న గొడవ చివరికి మామ ప్రాణాలను బలితీసుకుంది. తన కూతుర్ని ఎందుకు రోజు కొడుతున్నావు ఎందుకు అని మామ అల్లుడిని అడగగా వివాదం తలెత్తింది. ఇక చిన్న గొడవ పెద్దగా అవడంతో అల్లుడు కోపంతో రోకలిబండతో మామ పై దాడి చేసే ప్రయత్నం చేయగా కూతురు అడ్డుపడింది. కానీ ఆవేశంలో ఉన్న గోపి పక్కనే ఉన్న రోకలితో మామ తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

 


ఇక ఈ ఘటనలో స్థానికులు గమనించి బాధితుడిని ఆసుపత్రికి తరలించగా... కానీ అప్పటికే జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. మామ అప్పటికే మృతి చెందాడు అని వైద్య అధికారులు నిర్ధారించడం జరిగింది. సమాచారం తెలుసుకున్న నల్గొండ పోలీస్ అధికారులు సంఘటనపై విచారణ చెప్పట్టారు. ఇక మృతుడి కుమారుడైన ప్రకాష్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. దీంతో పోలీసు అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: