వైద్యుల దగ్గరికి రోజూ ఎంతోమంది పేషెంట్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు కొంత మంది పేషెంట్స్  సమస్య చూస్తే వైద్యులు సైతం ఆశ్చర్య పోతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి తీవ్రమైన వాంతులు విరేచనాలతో డాక్టర్ల వద్దకు వచ్చాడు.. అతన్ని పరీక్షించిన వైద్యులు.. అతని రిపోర్టులు  చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే అతడి కాలేయాన్ని పరాన్నజీవి క్రమక్రమంగా తినేసింది. చైనాలో జరిగింది ఈ ఆసక్తికర ఘటన. ఇటీవలే ఓ వ్యక్తి చేపను  ఉడికించకుండా  అలాగే తినేసాడు. అయితే తిన్నప్పుడు టేస్ట్ బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం అతనికి వాంతులు-విరేచనాలు అలసట కడుపునొప్పి జ్వరం ఇలా ఎన్నో సమస్యలు వచ్చి పడ్డాయి .


టాబ్లెట్ వేసుకుంటే ఈ సమస్యలు తగ్గుతాయి అనుకున్నాడు. కానీ  టాబ్లెట్ లు వేసుకొన్నప్పటి పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించాడు ఆ వ్యక్తి. ఇక ఆ వ్యక్తి పరిస్థితిని చూసిన వైద్యులు అతన్ని పరీక్షించి  రిపోర్టులు చూసి షాక్ అయ్యారు. కాలేయాన్ని ఏదో పరాన్నజీవి క్రమక్రమంగా సగం వరకు తినేసిసినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే చికిత్స మొదలు పెట్టిన వైద్యులు తప్పనిసరి పరిస్థితుల్లో కాలేయాన్ని కూడా కొంతవరకు తొలగించాల్సి వచ్చింది.


ఇక చికిత్స అనంతరం సదరు రోగికి కొన్ని షాకింగ్ విషయాలు  చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల క్రితం తాను చేపలను ఉడక  పెట్టకుండా తిన్నానని తెలిపాడు. దీంతో వైద్యులకు అసలు విషయం అర్థమైంది . ఉడక పెట్టకుండా పచ్చిగా ఉండే చేపల్లో కొన్ని పరాన్నజీవులు ఉంటాయని.. అవి శరీరంలోకి ప్రవేశించి గుడ్లు పెట్టి క్రమ క్రమంగా వాటి సంతతిని పెంచుకుని... శరీర అవయవాలను ఒక్కొక్కటిగా తింటాయి అంటూ వైద్యులు తెలిపారు. అందుకే మాంసాన్ని బాగా ఉడికించిన తర్వాతే తినాలి అంటూ  సూచించారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: