రైతులకు ప్రయోజనం కలిగించాలనే లక్ష్యంతో గుజరాత్ ప్రభుత్వం సరికొత్త స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. దీని వల్ల ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇలా ఏ ప్రీమియం లేకుండానే పంటకు భీమా కల్పిస్తోంది ప్రభుత్వం.అన్నదాతలని ఆదుకోవాలని అకాల వర్షాలు, కరవు, వరదల కారణంగా పంట నష్టం వాటిలితే వారికి ప్రయోజనం కలిగించడం ముఖ్యం అని ఈ నిర్ణయం తీసుకుంది గుజరాత్‌ ప్రభుత్వం. ఇలా   రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పధకానికి శ్రీకారం చుట్టింది. అందుకే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే వారికి ప్రయోజనం కలుకుందని ప్రకటించడం జరిగింది.


కిసాన్ సహాయ యోజన పేరుతో రైతుల కోసం గుజరాత్ ప్రభుత్వం  ఈ పథకాన్ని ప్రారంభం చెయ్యడం జరిగింది. ప్రధాన్ మంత్రి ఫసల్ భీమా యోజన స్కీమ్‌కు బదులుగా  గుజరాతీ ప్రభుత్వం ఈ స్కీమ్‌ను రైతన్నలకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం గుజరాత్ లో మాత్రమే. ఖరీఫ్ పంటకు సంబంధించి 56 లక్షల మంది రైతులకు కొత్త స్కీమ్ ద్వారా ప్రయోజనం కల్పిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. అయితే గుజరాత్ లోని జూన్ నుంచి నవంబర్ మధ్య కాలంలో వరదలు, అకాల వర్షాలు కారణంగా పంట దెబ్బతింటే రైతులకు పరిహారం అందిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.


ఈ పరిహారం మేరకు రైతులు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని లక్ష వరకు పరీహారం అందిస్తున్నట్టు చెప్పింది . ఒక ఎకరానికి గాను  రూ.25 వరకు పరిహారం లభిస్తుందని పేర్కొంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఏడాది పంట బీమా కోసం ఎక్కువగా డిమాండ్ చేయడంతో , ప్రభుత్వం ఆ కంపెనీలకు రూ.4,500 కోట్లు చెల్లించాల్సి వస్తుందని..... అందుకే వారి ప్రతిపాదనను తిరస్కరించి, కొత్త స్కీమ్‌ను తీసుకు వచ్చామని చెప్పింది. కొత్త వెబ్‌సైట్ వస్తుంది  దాని ద్వారా నమోదు చేసుకోవచ్చు అని చెప్పింది.




మరింత సమాచారం తెలుసుకోండి: