కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతోంది. ఈ పథకంలో కనుక చేరితే ప్రతి నెలా మీ చేతికి డబ్బులు వస్తాయి. అయితే ఎలా పొందవచ్చో ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. దీని కోసం ప్రతి నెలా కొంత మొత్తం చెల్లిస్తూ రావాలి. అది కూడా నెలకు రూ.55 నుంచి ప్రారంభమౌతోంది. కేంద్రం ప్రజలకి అనేక పథకాల్ని అందిస్తున్న సంగతి తెలిసినదే. వీటిల్లో పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన కూడా ఒక మంచి పధకం. ఈ పధకం ద్వారా ప్రతీ నెల పెన్షన్ వస్తుంది.

ఈ పీఎం శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన కింద ప్రతీ నెల రూ.3,000 పెన్షన్ ని తీసుకోవచ్చు. దీనితో ఏడాదికి రూ.36,000 వస్తాయి. గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే 60 ఏళ్లు దాటిన తర్వాతనే ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. ఈ పధకానికి 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న వారు అర్హులు.  దాదాపు 45 లక్షల మంది ఈ పథకంలో ఇప్పటి దాక చేరారు. 18 ఏళ్ల వయసు వారైతే  మీకు 60 ఏళ్లు వచ్చే వరకు ప్రతీ నెల రూ.55 కట్టాలి. కనుక రోజుకు రూ.2 ఆదా చేసుకుంటే మీరు నెలకు రూ.3,000 పొందవచ్చు. అంటే సంవత్సరానికి రూ.36 వేలు మీకు లభిస్తుంది.

అదే  మీరు 29 ఏళ్ల వయసులో ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.100 చెల్లించాలి. 60 ఏళ్లు వచ్చే వరకు ఈ పని చేయాలి. 40 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే నెలకు రూ.200 చెల్లించాలి. అసంఘటిత రంగంలోని వారికి మాత్రమే  వర్తిస్తుంది. కనుక వలస కూలీలు, కార్మికులు, ఎలక్ట్రీసియన్, స్వీపర్స్ వంటి వారు చేరవచ్చు. అలానే నెలకు రూ.15,000లోపు మీ ఆదాయం ఉంటే కూడా ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ ఉంటే  చేరొచ్చు. పూర్తి వివరాల కోసం 1800 267 6888 నెంబర్‌కు కాల్ చేసి కూడా స్కీమ్ వివరాలు తెలుసుకోవచ్చు. సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి మరచిపోకండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: