రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా అనేది ఇప్పుడు కాస్త ఊపిరి ఇస్తుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా బలహీనంగా ఉన్న రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా అనేది చాలా వరకు కూడా ఉపయోగకరంగానే ఉంది. రాజకీయంగా విపక్షాలను ఇబ్బంది పెట్టడానికి సోషల్ మీడియాను ఎక్కువగా అధికార పార్టీలు కూడా వాడుతున్నాయి. అయితే కొంత మంది అధికార పార్టీ కార్యకర్తలు కొన్ని రాష్ట్రాల్లో చెలరేగిపోతున్నారు .ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు...

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీల మీద ఉన్న అభిమానాన్ని లోపల ఉంచుకుంటే బాగానే ఉంటుంది. విపక్షాలను విమర్శించడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే వ్యక్తిగత విమర్శలు చేయడంతో కొంతమంది కాస్త పార్టీలను ఇబ్బంది పెడుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా న్యాయవ్యవస్థ మీద వైసీపీ కార్యకర్తలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి.

దీనితో వైసీపీ అధిష్టానం కూడా కాస్త ఇబ్బంది పడుతుంది. కొంత మంది కార్యకర్తలను కాపాడడానికి ఏకంగా ఎమ్మెల్యేలు మంత్రులు రంగంలోకి దిగారని వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారిని కాపాడటానికి చాలావరకు మంత్రులు కష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ తరఫున కొంత మంది విదేశాల్లో ఉన్న వారు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వారందరూ కూడా న్యాయ వ్యవస్థ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీని వలన పార్టీ ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉండవచ్చు. కొంతమంది న్యాయవ్యవస్థ మీద నాయకుల అండ చూసుకుని రెచ్చిపోయారు. రేపు సీబీఐ విచారణలో వారిని విచారించి ఆ తర్వాత నాయకుల పేర్లు వారి చెప్తే మాత్రం అనవసరంగా పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యకర్తలు కాస్త పరిధిలో విమర్శలు చేస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: