ఏదైనా పనిని జడ్జ్ చేయాలంటే ఎవరైనా ఏంచేస్తారు.. ఆ పని ఏంటి.. ఎందుకు చేశారు.. అందుకు కారణమేంటి. దాని పర్యవసానాలేంటి.. దీనివల్ల లాభం ఏంటి.. నష్టం ఏంటి..అని ఆలోచిస్తారు.. అసలు ఈ పనికి దారి తీసిన పరిస్థితులేంటని అంచనా వేస్తారు.. అప్పుడు అది తప్పో రైటో అంచనా వేస్తారు.. ఈ సూత్రం వ్యక్తులకైనా.. న్యాయమూర్తులకైనా.. మీడియాకైనా వర్తిస్తుంది.. కానీ.. కొందరు మాత్రం ఇన్ని ప్రశ్నలు వేయరు.. వాళ్లు వేసే ఒకే ఒక్క ప్రశ్న.. ఆ పని చేసింది ఎవరు..?

ఆ పని చేసింది ఎవరు అన్న ఒకే ఒక్క ప్రశ్నతో అది తప్పో.. ఒప్పో.. ఆ ప్రశ్న ఏంటి.. ఆ న్యాయమూర్తి ఎవరు అంటారా.. ఆ ప్రశ్న ఏంటంటే.. ఆ పని చేసింది ఎవరు.. ఆ న్యాయమూర్తి ఎవరంటే పచ్చ మీడియా.. అంతే.. ఆ పని చేసింది సీఎం జగన్ అయితే.. అది తప్పే.. ఆ పని చేసింది చంద్రబాబు అయితే అది రైటే.. ఆ పని చేసింది వైసీపీ నాయకుడైతే.. తప్పే.. ఆ పని చేసింది టీడీపీ నాయకుడైతే రైటే.. అంతే.. అంతకుమించి ఆలోచించడానికి ఏమీ లేదు.. విచారించడానికి ఏమీ లేదు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. టిటిడి బంగారాన్ని ప్రభుత్వ బ్యాంకు అయిన ఎస్బీఐలో డిపాజిట్ చేయడాన్ని కూడా కొన్ని పత్రికలు తప్పుబడుతున్నాయి. ప్రైవేటు బ్యాంకు ఐఓబీలో బంగారం పెట్టకుండా ప్రభుత్వ బ్యాంకు అయిన ఎస్‌బీఐలో పెట్టడం తప్పన్నట్లుగా రాసుకొస్తోంది. అంతే కాదు..  ప్రభుత్వానికి ఎస్బీఐ అప్పు ఇవ్వడానికి సిద్దంగా ఉందని, అందుకే బ్యాంక్ లో బంగారం డిపాజిట్ చేశారని ఈ పత్రిక రాస్తోంది.

నిజంగా అది తప్పే అనుకుందాం.. కానీ. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రైవేటు బ్యాంక్ అయిన ఎస్ బ్యాంక్ లో 1400 కోట్ల రూపాయల డిపాజిట్ చేసింది. కానీ అదెప్పుడు తప్పుగా ఆ పత్రిక రాయలేదు. ఎందుకంటే ఆ పని చేసింది చంద్రబాబు కదా.. అందుకే అది రైట్.. మరి జగన్ ప్రభుత్వాన్ని అంత గుడ్డిగా వ్యతిరేకిస్తే ఆ పచ్చ పత్రిక రాసే వార్తలు జనం నమ్ముతారా..

మరింత సమాచారం తెలుసుకోండి: