చానాళ్ల తర్వాత మళ్లీ సునామీ వచ్చింది.. టర్కీ, గ్రీస్ దేశాల సమీపంలోని ఏజియన్‌ సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా  సునామీ వచ్చింది. అయితే ఇది గతంలో వచ్చినంత భయంకరమైన సునామీ కాదు.. కాకపోయినప్పటికీ దీని ప్రభావం అంత తక్కువగా కూడా ఏమీ లేదు. ఏజియన్‌ సముద్రంలో సంభవించిన భూకంపం టర్కీ, గ్రీస్‌ దేశాలను అల్లకల్లోలం చేసేసింది. ఈ భారీ భూకంపం కారణంగానే చిన్నపాటి సునామీ  వచ్చింది. ఈ భూకంంప ధాటికి టర్కీ, గ్రీస్ చిగురుటాకుల్లా వణికిపోయాయి.

టర్కీ, గ్రీస్ దేశాల సమీపంలోని ఏజియన్‌ సముద్రంలో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7 గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి టర్కీ, గ్రీస్ లోని పలు నగరాలు బాగా దెబ్బ తిన్నా.. టర్కీలోని మెట్రోపాలిటన్‌ నగరం ఇజ్మిర్‌ బాగా దెబ్బితిన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మహానగరంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ భూకంపం, సునామీ కారణంగా ఎంత మంది చనిపోయారన్నది ఇంకా తేలలేదు. కానీ.. ప్రాణనష్టం అధికంగానే ఉండొచ్చని తెలుస్తోంది.

ఇజ్మిర్‌ పట్టణంలో పలు భవనాలు నేలమట్టమైన ఫోటోలు కనిపిస్తున్నాయి. భూంకంపం కారణంగా సంభవించిన సునామీతో సముద్రపు నీరు వీధుల్లోకి  వచ్చింది. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని చోట్ల భవనాలు కుప్పకూలాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోనూ  భూకంపం వచ్చినా అక్కడ ఆస్తి, ప్రాణ నష్టం లేనట్టు తెలుస్తోంది. గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. గ్రీస్‌కు చెందిన ద్వీపం సామోస్‌లోనూ భూకంపం రావడంతో ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

ఏజియన్‌ సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చిందట. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత విషయంలో కాస్త భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ భూకం తీవ్రత 6.6 తీవ్రత అని టర్కీ డిజాస్టర్‌ అండ్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ చెబుతోంది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.0గా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే  చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: