విశాఖ జిల్లాలోని భీమునిపట్నాన్ని డచ్చివారు, ఆ తర్వాత బ్రిటిష్ వారు అభివృద్ధి చేశారు. ఆ తర్వాత విశాఖ పట్నంకు ప్రాముఖ్యత బాగా పెరిగింది. దీంతో భీమిలిగా మారిన భీముని పట్నం విశాఖ ముందు చిన్నబోయింది. భీమిలిలోఒక జెట్టీ కట్టాలన్నది దశాబ్దాలుగా అక్కడి మత్స్యకారుల కోరిక, బ్రిటిష్ పాలకులు ఏలిన రోజుల్లో భీమిలి నుంచే షిప్పింగ్ కార్యకలాపాలు సాగేవి అని చెబుతారు. ఆ తర్వాత విశాఖపట్నంలో పోర్టు ఏర్పడటంతో భీమిలి ప్రాధాన్యం క్రమ క్రమంగా తగ్గిపోయింది. భీమిలి పూర్తిగా ప్రాభవం కోల్పోతుందన్న దశలో అక్కడ జెట్టీ నిర్మాణం కొత్త ఊపిరిపోస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక రాజకీయ నాయకులు మాత్రం ఎన్నికల వేళ భీమిలిలో జెట్టీని నిర్మాణం చేయిస్తామంటూ ఓట్లేయించుకుంటూ పబ్బం గడుపుకున్నారు. తీరా ఇన్నాళ్లకు భీమిలి జెట్టీ కోరిక జగన్ సర్కార్ తీర్చేలా కనిపిస్తోంది. భీమునిపట్నం, నక్కపల్లిలోని రాజయ్యపేటలలో రెండు జెట్టీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిధ్ధమవుతోంది. దీంతో పాటు విశాఖ జిల్లాలో పూడిమడక వద్ద ఫిషింగ్ హార్బర్ ని కూడా నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. దీంతో విశాఖ జిల్లాలోని మత్యకారులకు సీఎం జగన్ గొప్ప వరం అందించినట్టవుతుంది. ఫిషింగ్ హార్బర్, జెట్టీ నిర్ణాణంలో భీమిలికి ప్రాధాన్యం పెరుగుతుంది. విశాఖకు పాలనా రాజధానిని తరలిస్తున్న దశలో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై జగన్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే.. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ అక్కడ జరిపేందుకు నిర్ణయించారు. దశాబ్దాల కలలన్నిటినీ సాకారం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి