ఎప్పటికప్పుడు తెలివిగా ఉంటూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తే కానీ రాజకీయంలో ఎక్కువ కాలం అధికారంలో ఉండడం కుదరని పని.. అందుకు తోడు చంద్రబాబు తర్వాత లీడర్ సరిగ్గా లేకపోవడం కూడా టీడీపీ ఓటమికి కారణం.. లోకేష్ ని ప్రజలే కాదు సొంత పార్టీ నేతలు కూడా నమ్మే పరిస్థితి లేదు.. దాంతో చంద్రబాబు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నాడు.. వైఎస్ జగన్ దెబ్బకు కుదేలైపోయి అసలు రాజకీయాలలో ఉంటాడా లేడా అన్నట్లు అయన పరిస్థితి తయారైంది.
ఇకపోతే సొంత పార్టీ నేతలతోనే చెప్పించుకునే స్థితి కి దిగజారిపోయాడు బాబు. ఏడాదిన్నరలో జమిలీ ఎన్నికలు వస్తాయని తెలుగుదేశం పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. దానికి సంబంధించి వారి వద్ద స్పష్టమైన సమాచారం ఉందో లేదో స్పష్టత లేదు కానీ.. తాము ఎదుర్కొంటున్న వేధింపుల విషయంలో మాత్రం.. కంట్రోల్ తప్పి పోతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి లాంటి నేతలు.. తాము అధికారంలోకి వస్తే.. ఏ ఒక్కర్నీ వదిలి పెట్టబోమని హెచ్చరిస్తూ ఉన్నారు. తాము ప్రతీకారం తీర్చుకోవడానికి చంద్రబాబు అంగీకరించకపోతే.. ఉరితాళ్లు తీసుకెళ్లి ఆయన ముందు నిల్చుంటామని.. చావమంటారా అని అడగడం తప్ప..ఇంకేమీ చేయలేమని కూడా అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపుగా చేస్తున్న పనుల్లో పది శాతం చేసినా వైసీపీ నేతల వ్యాపారాలన్నీ ఎప్పుడో కుప్పకూలిపోయి ఉండేవి. అందుకే టీడీపీ నేతల్లో ఆగ్రహం రగిలిపోతోంది. అధికారం అందిన తర్వాత తాము అంతకు మించి చేయాలన్న కసితో ఉన్నారు. చంద్రబాబు ఎక్కడ అడ్డుకుంటారోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి