బీఎస్‌ యెడియూరప్పను సుప్రీంకోర్టు ఏమని ప్రశ్నించిందో తెలుసా...?

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

న్యూఢిల్లీ: సీఎం అయిన మీకు వ్యతిరేకంగా అరెస్ట్‌ వారెంట్‌ ఎవరు జారీ చేస్తారని బీఎస్‌ యెడియూరప్పను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఓ కేసులో ఆయనతోపాటు పరిశ్రమల శాఖ మాజీ మంత్రి మురుగేష్‌కు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించింది. అయితే పాత కేసును నెల రోజుల్లో పునరుద్ధరించాలన్న కర్ణాటక హైకోర్టు ఆదేశాన్ని పక్కనపెట్టేందుకు నిరాకరించింది. 2011లో కర్ణాటకలో పరిశ్రమ ఏర్పాటుకు ఒక ప్రైవేట్‌ సంస్థకు 26 ఎకరాల భూమిని ఇస్తామని నాటి యెడియూరప్ప ప్రభుత్వం హామీ ఇచ్చింది.

కాగా, ఆమోదించిన స్థలాన్ని తిరిగి వెనక్కు తీసుకోవడంపై పారిశ్రామిక వేత్త ఆలం పాషా కోర్టును ఆశ్రయించారు. సీఎం యెడియూరప్ప, నాటి పరిశ్రమల మంత్రి మురుగేష్ నిరానీ, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ వీపీ బలిగర్, కర్ణాటక ఉద్యోగ్ మిత్రా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ కె శివస్వామికి వ్యతిరేకంగా నేరపూరిత కుట్ర, పత్రాల ఫోర్జరీ ఆరోపణలు చేశారు.

2016లో సిటీ సివిల్‌ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్‌ చేశారు. విచారణ జరిపిన కోర్టు ఈ కేసును నెల రోజుల్లో పునరుద్ధరించాలని జనవరి 6న ఆదేశించింది.

బీఎస్‌ యెడియూరప్పతోపాటు, మాజీ మంత్రి మురుగేష్‌ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే వీరి పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపారు. 'మీరు సీఎం.. మీకు వ్యతిరేకంగా ఎవరు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తారు' అని ఆయన ప్రశ్నించారు. అయితే కేసు పునరుద్ధరణ నేపథ్యంలో కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసే అవకాశం ఉన్నదని మాజీ అటర్నీ జనరల్‌ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో యెడియూరప్పతోపాటు మురుగేష్‌కు అరెస్ట్‌ నుంచి కోర్టు రక్షణ ఇచ్చింది. అయితే కేసు పునరుద్ధరణనకు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కల్పించుకోబోమని పేర్కొంది.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: