చర్యలు తీసుకోవాల్సిన సమయంలో సహనంగా ఆలోచించడం ఎంతవరకు సమంజసమన్నారు. మేనిఫెస్టో అంశంపై ఎస్ఈసి అధికారిగా చంద్రబాబు పై వెంటనే చర్యలు తీసుకోవడం నిమ్మగడ్డ కర్తవ్యం. కానీ అలా చేయకుండా మేనిఫెస్టో రద్దు చేయడం వల్ల ఉపయోగం ఏమిటో చెప్పాలన్నారు. మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించారు పెద్ది రెడ్డి. ఎస్‌ఈసీ యాప్‌ను వాడొద్దని హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటు కూడా నమోదు చేయడం తెలియని వ్యక్తి ఎస్ఈసి ఎలా అయ్యారో..?? అర్థం కావడం లేదు అంటూ ఎద్దేవా చేశారు.
కోర్టు తీర్పుతో ఎస్‌ఈసీ పదవికి నిమ్మగడ్డ రాజీనామా చేయాలి అని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. ఏకగ్రీవాలను పలు రకాలుగా తప్పు పడుతున్నారు. కానీ ఏకగ్రీవాలు చట్టవిరుద్ధమని ఏ చట్టంలో ఉందో చెప్పాలంటూ ధ్వజ మెత్తారు పెద్ది రెడ్డి. ఏకగ్రీవాలన్నవి ఎప్పటినుండో వస్తున్నాయి.. మా స్వార్థం కోసం సృష్టించబడింది కాదు. ప్రజల క్షేమమే మా ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు ఆయన. చంద్రబాబుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేందుకే నిమ్మగడ్డ పని చేస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. గుంటూరు, చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలు ఏ ఆధారంగా ఆపేస్తారు.
టీడీపీని నిలబెట్టేందుకు నిమ్మగడ్డ ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పిన ఆయన అధికారంలో ఉన్నమంత్రులు తప్పు చేస్తే సీఎం లేదా సీఎస్‌కు లేఖ రాయాలి. కానీ నిమ్మగడ్డ గవర్నర్‌కు లేఖ రాయడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. ప్రివిలేజ్ కమిటీ ఆదేశిస్తే నిమ్మగడ్డ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు పెద్ది రెడ్డి. నిమ్మగడ్డ మాటలు విని అక్రమాలకు సహకరిస్తే సహించేది లేదన్నారు. మనం పని చేయాల్సింది ప్రజల కోసం అన్న విషయాన్ని ప్రతిక్షణం గుర్తు పెట్టుకోవాలని సూచించారు పెద్ది రెడ్డి. దీనిపై నిమ్మగడ్డ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి