ఆంధ్రప్రదేశ్ లో
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత
జనసేన పార్టీ నాయకత్వాన్ని మార్చే ఆలోచన
పవన్ కళ్యాణ్ చేస్తున్నారని రాజకీయ వర్గాలు ముందు నుంచి కూడా అంటూ ఉన్నాయి. అయితే
పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర
పార్టీ అధ్యక్షుడి మార్పు విషయంలో మాత్రం కాస్త ఆలోచనలో పడ్డారని అంటున్నారు. ముందు
నాదెండ్ల మనోహర్ కి ఆ పదవి ఇవ్వాలని భావించి
కమ్మ సామాజిక వర్గంను ఆకట్టుకునే ప్రయత్నం
పవన్ కళ్యాణ్ చేశారని అందరూ భావించారు. అయితే ఇప్పుడు దళిత నేతల వైపు చూస్తున్నారని అంటున్నారు.
వాస్తవానికి రాష్ట్రంలో కీలక పార్టీలలో ఏ పార్టీకి కూడా దళిత నేత అధ్యక్షుడిగా లేరు. కాబట్టి
జనసేన పార్టీ గనుక ఆ పని చేస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో బలపడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా దళిత ఓటు బ్యాంకు ఆయన పెంచుకోవచ్చు అని భావిస్తున్నారు. దీనికి సంబంధించి
పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే చర్చలు జరిపిందని
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్
నాదెండ్ల మనోహర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని అంటున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో కచ్చితంగా ఇది హైలెట్ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో దళిత ఓటు కీలకం కానుంది. కాబట్టి ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టారని అంటున్నారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుని నిర్ణయాన్ని
పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వంతో కూడా దీనిపై చర్చించిన తర్వాత
పవన్ నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే
జనసేన పార్టీ లో జరగబోయే మార్పులకు సంబంధించి కూడా
పార్టీ కార్యకర్తలు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ నేతలలో కూడా ఇప్పుడు
జనసేన పార్టీ తీసుకునే నిర్ణయాలపై కాస్త చర్చ జరుగుతోంది.