
ఆ పెద్దాయన మాస్క్ పెట్టుకున్నా ముక్కు కవర్ కాలేదు. దీంతో అతనిని చక్కగా పట్టుకుని ఉన్నాయి కరోనా కణాలు. ఈలోపు అటుగా ఒక చిన్నారి, ఆమె తల్లి వెళుతూ వస్తున్నారు. అదే సమయంలో ఆ పెద్దాయన తుమ్మాడు. ఆ తుంపరలతో పాటు కరోనా కూడా ఆ తల్లీ, పిల్ల మీదకు చేరాయి. అయితే, అవి ఎంత ప్రయత్నం చేసినా వారి శరీరంలోకి ప్రవేశించలేకపోయాయి. ఇందులో అన్ని అంశాలూ ఇమిడిపోయాయి. 1. మాస్క్ ధరించాలి, 2. ఎట్టి పరిస్థితిలోనూ చేతితో ముక్కును తడమ కూడదు. 3. మాస్క్ ను ముక్కు పూర్తిగా కవర్ అయ్యేలా పెట్టుకోవాలి. 4. ఒకరికి ఒకరు దగ్గరగా ఉండకూడదు. 5. బయట నుంచి ఇంటిలోకి వెళ్ళిన వెంటనే మాస్క్ శుభ్రం చేసుకుని, చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. వీటిని పాటిస్తే కరోనాకు అవకాశమే ఉండదు. ఈ వీడియో ద్వారా సైబరాబాద్ పోలీసులు మంచి సందేశాన్ని ఇవ్వడమే కాదు, ప్రతి ఒక్కరికి తాము చేసే తప్పులను ఎత్తి చూపారు.