ఇప్పుడు ఎవరి నోట విన్నాగాని ఆనందయ్య అనే పేరు మారు మోగిపోతుంది. ఆయన ఇచ్చే మందు కోసం జనాలు కృష్ణ పట్నం పరుగులు పెడుతున్నారు. కొంతమంది ఆయన మందుని నమ్మితే మరికొంతమంది మాత్రం ఆయన ఇచ్చేమందు కరోనాను తగ్గించలేదని వాదిస్తున్నారు.అయితే ఈ విషయంపై ఒక కెమిస్ట్రీ లెక్చరర్ స్పందించారు సైన్స్ పేరిట ఆయూర్వేదాన్ని దుష్ప్రచారం చేయొవద్దు.అసలు ఈ ప్రపంచానికి జ్జాన బిక్ష పెట్టింది భారతదేశ బౌద్ద విశ్వవిద్యాలయాలు అని తెలిపారు.అలాగే ఆనందయ్య కరోనా రోగుల కోసం ఇస్తున్న ఆయుర్వేదిక్ మందులో ఏమేమి కలుపుతున్నాడు,వాటి వలన కలిగే ఉపయోగాలు గురించి తెలిస్తే మీరు కూడా ఆనందయ్య ఇచ్చే మందు మంచిదే అని నమ్ముతారు. ఆనందయ్య తయారు చేస్తున్న మందులో ఈ క్రింది మూలికలు వాడుతున్నాడు.

1)అల్లం - అల్లం రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే అల్లం శ్వాసకోశ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది అని సైన్స్ కూడా చెబుతుంది.
2) తాటిబెల్లం - ఆయుర్వేద మందులంటే కొన్ని చేదుగా, హాటుగా ఉంటాయి.అందుకనే ఆయుర్వేద మందును  

తాటిబెల్లంతో తీసుకుంటారు.తాటిబెల్లం తినడానికి తియ్యగా ఉన్న, వేసుకునే  ఔషదం యొక్క గుణధర్మానికి నష్టం చేయదు కాబట్టి తాటిబెల్లాన్ని వాడతారు.
3) తేనే - తేనే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయుర్వేదంలో చాలా ఔషదాల్లో వాడతారు. తేనేకు  కఫాన్నీ తగ్గించే గుణం ఉంటుంది.
4 ) నల్లజిలకర్ర - ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.నల్లజిలకర్రలో యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఉన్నాయి అలాగే కడుపునొప్పికి, విరచనాలకు, గ్యాస్ట్రిక్ సమస్యల్ని తొలగించడంలో ఇది ఉపయోగపడుతుంది.నల్లజిలకర్ర ఇన్సులిన్ ను అదుపులో ఉంచుతుంది కాబట్టి మధుమేహాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు.నల్లజిలకర్ర లోక్యాల్షియం,మెగ్నీషియం వంటి ఎన్నో రకాల  ఖనిజ పోషకాలు ఉన్నాయి.నల్లజిలకర్ర హనీకర సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా నుండి శరీరాన్ని కాపాడుతుంది.
5 ) తోకమిరియాలు- ఆయుర్వేదంలో తోకమిరియాలను కూడా విరివిగా వాడతారు. ఇవి స్వరపేటిక దోషాలను తొలగిస్తాయి. జలుబు, దగ్గు,కండరాల నొప్పికి తోకమిరియాలను వాడతారు.
6) లవంగాలు - లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టిరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు జలుబు ,దగ్గను నివారిస్తుంది. లవంగాల్లోని యుజెనల్ అనే పధార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫామెంటరీ గుణాలు ఉన్నాయి. లవంగాలను తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.
7) వేప - వేపలో సహజ కీటకనాసిని అని అందరికి తెలిసిందే. వేప రోగనిరోధక చర్యను వేగవంతం చేస్తుంది. విభిన్న బ్యాక్టీరియా ,వైరస్, శిలీంధ్రం,పరాన్నజీవుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.దగ్గు, ఆస్తమా, కఫం వంటి శ్వాసకోశ సమస్యల్లో వేప ఉపయోగపడుతుంది.
వేపను కడుపునొప్పి, అతిసారం ,గ్యాస్, అల్సర్ మొదలగు రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
8) నేరేడు - ఈ మొక్క లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల మూలంగా ఇది దివ్వ ఔషదంగా పనిచేస్తుంది. కాలేయాన్ని శుభ్రపర్చడానికి ఈ ఔషదాన్ని వాడతారు
జ్వరాన్ని తగ్గించడానికి నేరెడు చెట్టును వాడతారు.
ఈ మొక్క బ్యాక్టీరియల్ , వైరల్ ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడుతుంది.
9) మామిడి - కడుపులో పురుగులను తొలగించడానికి , జ్వరాన్ని తగ్గించడానికి , కాలేయసమస్యలో ఈ చెట్టు ఆకులను వాడతారు
10) నేల ఉసిరి- వైరల్ జ్వరాలకు తగ్గించడానికి ఈ మొక్కను వాడతారు. ఉదర, మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి వాడతారు అలాగె  హెపటైటిస్ -బి వైరస్ ను నిర్ములించడానికి వాడతారు.
11) కొండపల్లేరు - ఆయాసం , ఉబ్బసంను తగ్గించడానికి వాడతారు. క్షయ వ్యాధితో వచ్చే దగ్గును ఇది నివారిస్తుంది.ఈ చెట్టు మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది
12) కుప్పింటాకు - రోగనిరోధక శక్తిని పెంచడానికి , దగ్గు ,జలుబు ,గొంతునొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. కడుపులో ఉన్న నూలిపురుగులను తొలగించడానికి కూడా వాడతారు.
13) తెల్లజిల్లేడు పువ్వు : దీర్ఘకాలికంగా ఉన్న అస్తమాను నివారించడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ మొక్క వేర్లను పాముకాటుకు విరుగుడుగా కూడా ఉపయోగిస్తారు.అలాగే పైన చెప్పిన వాటితో పాటు ఆనందయ్య పట్టా ఆకు, బుడ్డబుడస ఆకు, ముళ్ళ వంకాయ ఆకు, తెల్ల జిల్లేడు పూల మొగ్గలను కూడా ఈ మందులో వాడుతున్నారు.ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందులో ఇన్ని రకాల ఉపయోగాల ఉండడం వలనే
కరోన రోగులకు ఈ మందు 100% ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: