ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వైద్యం మరియు ఆరోగ్య శాఖలకు సంబంధించిన అధికారులంతా పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో కరోనా థర్డ్ వేవ్ కి సంబంధించిన పలు కీలక విషయాల గురించి చర్చించనున్నారు. గత నెల నుండి జరుగుతున్న ప్రచారం మరియు కోవిడ్ నిపుణులు మరియు వైద్య నిపుణులు సూచనలు సలహాల ప్రకారం కరోనా మూడవ దశ కేవలం పిల్లలపై అధిక ప్రభావాన్ని చూపనున్నట్లు తెలుస్తోంది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ రోజు సమావేశంలో వైద్యారోగ్య శాఖ కరోనా మూడవ దశ ఏ స్థాయిలో ఉండనుంది అనే దానిపై విస్తృతంగా చర్చించనున్నారు. 

ఈ సమావేశం ద్వారా కరోనా పిల్లలకు సోకకుండా ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన తగిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఇందులో మరొక ప్రధానమైన అంశం గురించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పిల్లలు కలిగి ఉన్న తల్లికి ముందుగా వ్యాక్సినేషన్ ఇచ్చే విధంగా మార్గదర్శకాలను ఇచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా కొంతమేరకు తల్లి వ్యాక్సిన్ వేసుకుని ఉంటుంది కాబట్టి, కరోనా వారి పిల్లలకు సోకదు అనే ఒక ధైర్యాన్ని కలిగించవచ్చు. ఒకవేళ మూడవ దశలో కరోనా సోకిన పిల్లలకు ఏ విధమైన చికిత్సను అందించాలి. ఇప్పటి వరకైతే పెద్ద వారికి ఒకరకమైన చికిత్సను చేస్తూ వచ్చారు. కానీ పిల్లల విషయంలో పెద్దల చికిత్సా విధానాలను అమలు పరచడానికి వీలు కాదు. మెడిసిన్ పరిమాణం, మెడికల్ ఎక్విప్మెంట్ లో మార్పులు, వైద్యంలో ఖచ్చితంగా స్వల్ప మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది.

పిల్లలకు వారి వయసును బట్టి మందులు మారిపోతాయి. ఉదాహరణకు పెద్ద వారికి టాబ్లెట్స్ ఇస్తాము, అదే కొంచెం తక్కువ వయసున్న పిల్లలకు టాబ్లెట్ పరిమాణం తగ్గిస్తాము, అదే మరీ చిన్న పిల్లలు అనుకోండి వారికి సిరప్ రూపంలో వైద్యాన్ని అందిస్తాము. ఈ విషయాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కోవిడ్ సోకిన పిల్లలకు ఏ విధంగా చికిత్సను అందించాలి అనే విషయంపై హాస్పిటల్ స్టాఫ్ కి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పై విషయాలపై ఒక స్పష్టమైన సమగ్రమైన నివేదికను వైద్యారోగ్య శాఖ అధికారులు సీఎం కు అందించనున్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ ఫోకస్ అంతా 45 సంవత్సరాలపై వయసున్న వారిపై చేస్తున్నందున పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం ఉండనుంది అని వైద్యారోగ్య శాఖ అధికారులు అనుకుంటున్నారు. అంతే కాకుండా బ్లాక్ ఫంగస్ కేసులు మరియు వాటి నియంత్రణ గురించి కూడా చర్చించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: