ఇప్పుడు దేశంలో కొవిడ్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో మనం గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి టైమ్‌లో దీనికి
చెక్ పెట్టాలంటే టీకాలు వేయడం ఒక్కటే ముందున్న దారి. అయితే మన దేశంలో వ్యాక్సిన్లపై ఇప్పటికే ప్రజల్లో ఎలాంటి అనుమనాలు ఉన్నాయో తెలుసు. ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే నర్సుల నిర్లక్ష్యంతో జనాలు మరింత భయానికి గురవుతున్నారు. ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్ మొదలయినప్పటి నుంచి చాలా రకాల వింత ఘటనలు జరుగుతున్నాయి.
అయితే ఇప్పుడు నాసిక్‌లో మరో వింత ఘటన జరిగింది. అదేంటంటే వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి పోలీసులకు వింత ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకున్న తర్వాత తన శరీరానికి ఇనుప వస్తువులు, చిల్లర నాణేలు అంటుకుంటున్నాయని చెప్పారు. తన శరీరం అయస్కాంతంలాగా మారిపోయిందని వివరించారు. అంతేకాదు బాధితుడు ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా చేసి సోషల్ మీడియాలో వదిలాడు. దీంతో ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర లోని నాసిక్‌కు చెందిన
అరవింద్ జగన్నాథ్ ఈ ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజుల క్రితం కొవిడ్ టీకా సెకండ్ డోస్ తీసుకున్నాడు ఈయన. ఆ తరువాతే అతని శరీరంలో ఈ వింత మార్పులు కనిపిస్తోందని ఆయన ఆరోపిస్తున్నాడు. అయితే మొదట చెమట కారణంగా ఇనుప వస్తువులు శరీరానికి అతుకుతున్నాయని బాధితుడి కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ జగన్నాథ్ స్నానం చేస్తున్న టైమ్‌లో కూడా ఇనుప వస్తువులు అతని శరీరానికి అంటుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
కాగా ఈ వింత కేసు
స్థానిక వైద్యులకు పెద్ద సవాల్‌గా మారింది. అయితే దీనిపై కొంత పరిశోధన అవసరమని డాక్టర్లు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఏ కామెంట్స్ చేయలేమని డాక్టర్లు వివరిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని నాసిక్
జిల్లా డాక్టర్
అశోక్ తోరత్ వివరించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే తమ చర్యలు ఉంటాయన్నారు.