ఇక GST గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.దీని గురించి అందరికి తెలిసిందే.దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల బదులు వస్తువులు, సేవల తయారీ, అమ్మకం, వినియోగాలపై విధించనున్న సమగ్రమైన పరోక్ష పన్ను అని తెలిసిన సంగతే. ఇక ఈ పద్ధతిలో GST కి సంబంధించిన వ్యాపారాలు తమ వాణిజ్య వ్యవహారాల్లో భాగంగా కొనుగోలు చేసే సాధారణ వస్తువులు, సేవలపై GST విలువ మీద పన్ను మినహాయింపును లేదా తగ్గింపును పొందవచ్చు. ఇక అలాగే వస్తువులు, సేవలపై పన్ను విధించే నిర్వహణ బాధ్యత సాధారణంగా ఏకైక అధికారి వద్దనే ఉంటుంది.ఇక ఎక్స్ పోర్ట్స్ జీరో-రేటెడ్ సప్లైలుగా పరిగణిస్తారు.ఇక ఇంపోర్ట్స్ పై జీఎస్టీ కిందకు రాని కస్టమ్ డ్యూటీనీ అలాగే దానితో పాటు దేశీయ వస్తువులు, సేవలకు పడేలాంటి GST ని విధిస్తారు.


ఇక కరోనా సెకండ్ వేవ్ తరువాత GST లో మార్పులు జరిగాయి.తాజాగా GST మండల సమావేశం జరిగింది.ఆ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు.బ్లాక్ ఫంగ్స్ చికిత్సలో వాడే ఇంజెక్షన్స్ మీద GST మినహాయింపు తీసుకోవడం జరిగింది.ఆక్సీజన్ యూనిట్లు, టెస్టింగ్ కిట్లు, పల్స్ ఆక్సీ మీటర్ల మీద GST మినహాయింపు తీసుకున్నారు.ఆక్సీజన్ ఉత్పత్తి యంత్రాల మీద కూడా GST మినహాయింపు తీసుకొని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.కోవిడ్ చికిత్సలో ఉపయోగించే మూడు రకాల మందుల మీద కూడా GST తగ్గించారు.వ్యాక్సిన్, టెంపరేచర్ కొలిచే పరికరాల మీద 5 శాతం GST యధాతధంగా ఉంటుంది.స్మశాన వాటికలో ఉపయోగించే విద్యుత్ దహన వేదికల మీద కూడా 5 శాతం GST ని తగ్గించారు.హ్యాండ్ శానిటైజర్ల మీద కూడా GST ని తగ్గించారు.ఇక ఓవరాల్ గా చూసుకుంటే రెమిడీస్ మీద కూడా 5 శాతం GST ని తగ్గించారు.ఇది కీలకమైన అంశం.ఇక కరోనా సెకండ్ వేవ్ తరువాత వీటిపై GST మినహాయింపు జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

GST