కర్ఫ్యూ పై సీఎం వైఎస్ జగన్ కొన్ని సూచనలు ఇచ్చారు. స్పందనపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వచించిన ఆయన జూన్‌ 20వరకూ కర్ఫ్యూ ఉంటుందని చెప్పామని, తర్వాత కర్ఫ్యూకి  కొన్ని సడలింపులు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. సడలింపులు ఇస్తూ కర్ఫ్యూ కొనసాగించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక స్పందనపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఆయన కోవిడ్, ఉపాధిహామీ పనులు, వైయస్సార్‌ అర్బన్‌క్లినిక్స్, ఇళ్లపట్టాలు, ఖరీఫ్‌ సన్నద్ధతలపై కూడా చర్చించారు.

 ఇక మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చిందని కేసుల సంఖ్య తగ్గుతోంది, పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని అన్నారు. కోవిడ్‌ ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దన్న ఆయన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించాలని అన్నారు. మాస్కులు, శానిటైజర్లు తదితర చర్యలన్నీ కొనసాగాలి, ఇవి మన జీవితంలో భాగం కావాలని అన్నారు. ఫోకస్‌గా టెస్టులు చేయాలని, గ్రామాల్లో చేస్తున్న ఫీవర్‌సర్వే కార్యక్రమాలు ప్రతి వారం కొనసాగాలని ఆదేశించారు. 

ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేసి పరీక్షలు చేయాలని ఎవరు కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నా.. పరీక్షలు చేసి వెంటనే వైద్యం అందించాలని అన్నారు. టెస్టులు ఇష్టానుసారం కాకుండా ఫోకస్‌గా, లక్షణాలు ఉన్నవారికి చేయాలని, ఎవరైనా కోవిడ్‌పరీక్షలు చేయమని అడిగితే వారికి కూడా చేయాలని అన్నారు. అన్ని టెస్టులు కూడా ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని ఆయన అన్నారు. ఇక 89శాతం మంది కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీ కింద తీసుకున్నారని పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా భారంపడకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు. ఈరోజు 16 వేల మందికి గాను 14 వేల మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: