భారతదేశ మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు గురించి ఎన్ని తారలు చెప్పుకున్నా తరగని సమాచారం ఉంటుంది. అంతలా ప్రతి ఒక్క భారతీయుడిని తన పాలనా తీరుతో ఆకట్టుకున్నాడు. దక్షిణ భారతదేశం నుండి ప్రధానమంత్రి పదవిని అధిరోహించిన మొదటి వ్యక్తి పీవీ కావడం విశేషం. అందరూ ఈయనను పీవీ గానే పిలుచుకునే వారు. ఇతను ప్రధాని మంత్రి అయ్యాక భారతీయ పరిపాలనా విధానంలో అనేక మార్పులను తీసుకు వచ్చి ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిచాడు. ఈ రోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన గురించి కొన్ని ప్రత్యకే విషయాలను తెలుసుకుందాము.

* పీవీ మొట్టమొదటిగా రాజకీయ జీవితాన్ని 1957 లో ప్రారంభించాడు. మంథని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తరువాత వెనుతిరిగి చూసింది లేదు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా మరియు ప్రహదానిగా ఇతను సేవలు అభినందనీయం, అమోఘం అని చెప్పాలి.

* పీవీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే, ఎంతమంది దానికి ఎదురుచెప్పినా దానిని ఆచరణలో పెట్టేవరకు నిద్రపోయేవారు కారు. తన తీసుకున్న నిర్ణయంలో ఎప్పుడూ రాజీపడింది లేదు. దీనికి కారణం ఏడైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాని గురించి పలుమార్లు ఆలోచించే తీసుకుంటున్నారు. అందుకే పీవీకి తాను తీసుకునే నిన్ఱయాలపైన అంత నమ్మకం.

* అప్పట్లో పీవీ గారు సీఎంగా ఉన్నప్పుడు, భద్రతా అధికారిగా పనిచేసిన చంద్ర ప్రకాష్ రావు ఆయన గురించి ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు. భూసంస్కరణలు తీసుకురావడంలో అతను ఎక్కడా రాజీ పడలేదు. అప్పట్లో పీవీ గారు తీసుకువసీఘిన ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని అందరూ వ్యతిరేకించినా, ఎంత ఒత్తిడి ఉన్నా దానిని సాధించి చూపించాడు. పనిలో అంత ఖచ్చితంగా ఉంటారని ఆయన పనితీరును మెచ్చుకున్నారు.

* పీవీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కార్యదర్శుల పనితీరును స్వయంగా మానిటర్ చేసేవారు. కార్యదర్శుల నుండి తన వద్దకు వచ్చే ప్రతి ఒక్క ఫైల్ ను సరిగ్గా చెక్ చేసి పంపేవారు. అందులో ఏమైనా తప్పులు ఉన్నా, నివేదికలు సరిగ్గా  లేకున్నా మందలించేవారు.  

* పీవీ గారు రివ్యూ మీటింగ్ లలో సంబంధిత అధికారులను అడిగే ప్రశ్నలకు వారంతా నీళ్లు నమిలేవారు. అతనిని సమాధానాలతో సంతృప్తి పరచడంలో చాలా ఇబ్బంది పడేవారు.

 * అప్పట్లో ఒక డిఎస్పీ పై ఫిర్యాదులు ఉన్న కారణంగా అతన్ని ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించుకున్నాడు. డిఎస్పీ కి అనుకూలంగా పోలీస్ అధికారి సపోర్ట్ చేయగా, అతని మాటలను ఏమాత్రం వినకుండా డిఎస్పీ ని బదిలీ చేయడంలో కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అంతే కాకుండా ఒకప్పుడు ఒక మేజిస్ట్రేట్ ను ఒక విషయంలో ఆరోపణలు ఉండడంతో, వెంటనే అధికారం నుండి తొలగించారు. తప్పు ఎక్కడైనా ఉంది అంటే దానిపై యాక్షన్ తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు.

* ముంబై లో ముస్లిం గొడవలు జరుగుతున్న సమయంలో ముస్లిం లు న్యాయం కోసం అడుగగా సరిగ్గా స్పందించినట్లు సమాచారం ఉంది.

* అంతే కాకుండా పీవీ కంప్యూటర్ వ్యవస్థను భారతదేశానికి  తీసుకురావడంలో పీవీ పాత్ర ఎంతో ఉంది. ఇండియాకు ఐటి విప్లవాన్ని రాజీవ్ గాంధీ తీసుకువచ్చినా పీవీ కృషి మరువలేనిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: