తిరుమల తిరుపతి దేవస్థానం.. దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానానికి అటు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అయితే సామాన్యుడు సంపన్నుడు  అనే తేడా లేకుండా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు అందరు. ఏడుకొండలపై వెలసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. ఇకపోతే కరోనా వైరస్ కారణంగా అటు శ్రీవారి భక్తులకు మధ్య ఎంతో దూరం పెరిగిపోయింది.  ఎప్పుడు కిటకిటలాడే తిరుమల తిరుపతి దేవస్థానం కాస్త ప్రస్తుతం భక్తులు లేక వెలవెలబోతోంది.



 అయితే ఇక అతి తక్కువ సంఖ్యలోనే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు టిటిడి బోర్డు సభ్యులు. ఇలా వరుసగా దర్శనాల సంఖ్యను తగ్గిస్తూ భక్తులకు షాకిస్తున్న టిటిడి బోర్డు.. ఇక ఇప్పుడు మరో సారి ఊహించని షాక్ ఇచ్చింది. శ్రీవారి ప్రసాదాల్లో ప్రత్యేకమైన జిలేబి మురుకుల సెట్ ధరలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది టిటిడి బోర్డు. ప్రస్తుతం జిలేబి మురుకు సెట్ ధర వంద రూపాయలు ఉంది. కానీ ఇటీవలే టీటీడీ అధికారులు వంద రూపాయలను కాస్తా 500 రూపాయలకు పెంచారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.  ప్రతి గురువారం శ్రీవారికి నిర్వహించే తిరుప్పావై సేవలో శ్రీవారికి ప్రసాదంగా సమర్పిస్తుంటారు. అయితే ఈ సేవలో పాల్గొనే భక్తులకు మాత్రమే ఈ ప్రసాదాన్ని అందజేస్తూ ఉంటారూ టీటీడీ అధికారులు.



 ఈ క్రమంలోనే ఇక ప్రతి గురువారం కూడా 7 నుంచి 10 పడుల జిలేబీలు తయారు చేసి భక్తులకు అందిస్తూ వుంటారు. ఇక భక్తులకు వితరణ చేసిన తర్వాత మిగిలిన ప్రసాదాన్ని టీటీడీ అధికారులు ఉద్యోగులకు పోలీసులకు విజిలెన్స్ అధికారులకు ఇలా అందరికీ అందరూ చేస్తూ ఉంటారు. అయితే మొన్నటి వరకు కేవలం వంద రూపాయలకు మాత్రమే ఈ ప్రసాదాన్ని అందించే వారు. కానీ ఇటీవల 500 రూపాయల ధర పెంచడంతో భక్తులకు షాక్ తగిలింది. అయితే దీనికి సంబంధించిన తాజా ఉత్తర్వులను టిడిపి అదనపు ఈవో ధర్మారెడ్డి జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏమైనా టీటీడీ తీసుకున్న నిర్ణయం మాత్రం అటు భక్తులకు ఇబ్బందికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ttd