
ఇలా దూసుకొస్తున్న మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ క్లబ్‌హౌజ్ ఇప్పుడు మరింతగా వినియోగదారులకు చేరువ కాబోతోంది. ఇంతకీ ఈ క్లబ్‌హౌజ్ ఏంటంటే.. ఇదో ఆడియో మెసేజింగ్ యాప్.. ఇప్పుడిప్పుడే బాగా ఫేమస్ అవుతోంది. అయితే దీనితో వచ్చిన చిక్కు ఏంటంటే.. దీన్ని ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల్లా మీరు డైరెక్టుగా డౌన్‌లోడ్ చేసుకుని వాడలేరు. ఇందులో మీ అకౌంట్ యాక్టివ్ కావాలంటే ఇప్పటికే క్లబ్ హౌజ్‌లో మెంబర్‌గా ఉన్న వారు మిమ్మల్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది.
అయితే ఈ నిబంధనే ఈ యాప్ విస్తృతికి అడ్డుకట్టగా మారింది. ఈ విషయం గమనించిన యాప్ నిర్వాహకులు ఇప్పుడు క్లబ్‌హౌస్ ను సరికొత్త మార్పులతో యూజర్స్ ముందుకు తెచ్చారు. ఇకమీదట ఎవరైనా నేరుగా యాప్ వాడుకోవచ్చు.. ఇకపై యాప్‌లోని ఇన్విటేషన్ ఫీచర్ ఉండదు. దీన్ని తొలగిస్తున్నట్లు క్లబ్‌హౌజ్ తెలిపింది. ఈ మేరకు క్లబ్‌హౌస్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం క్లబ్ హౌస్ యాప్ విడుదల చేశాక దాదాపు 80 లక్షల మంది కొత్త యూజర్స్ ఈ క్లబ్ హౌజ్‌కు వచ్చారు. ఇక ఇప్పుడు ఈ కొత్త మార్పులతో క్లబ్ హౌజ్ మరింత మందికి చేరువకానుందనే చెప్పాలి. మరి ఇంకేం.. మీరు కూడా ఓసారి ఈ క్లబ్‌హౌజ్‌ను వాడి చూడండి.. నచ్చితే కొనసాగొచ్చు. లేదంటే.. గుడ్‌బై చెప్పొచ్చు.. ఏమంటారు..?