ఇటీవల ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై ఒక షో షూటింగ్ సమయంలో రామ్ చరణ్ అడిగిన ప్రశ్న ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఎప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తావన్న రామ్ చరణ్ ప్రశ్నకు ఎన్టీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే వాటిని ఎడిటింగ్ లో కట్ చేయించారట తారక్. ఈ విషయం అలా అలా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వరకు పాకిందట, దాంతో చంద్రన్న పర్సనల్ గా తారక్ కి ఫోన్ చేసి మరీ నువ్వు ఈసారి తప్పకుండా మన పార్టీ తరపున నిలబడి మళ్లీ టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలి అని అడిగినట్లు సమాచారం. పార్టీలోని కార్యకర్తలు మరియు స్వర్గీయ నందమూరి తారకరామారావు ను ప్రాణంకంటే ఎక్కువగా అభిమానించే అభిమానులు సైతం ఎప్పటి నుండో ఎన్టీఆర్ టీడీపీని ముందుండి నడిపించాలని కోరుకుంటున్నారు.

తాతగారి మనవుడిగా బాధ్యత తీసుకోవాల్సిందే అంటూ ఒత్తిడి చేసినట్లు రాజకీయ రంగంలో ప్రచారం మొదలైంది. అయితే ఎన్టీఆర్ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియలేదు. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం ఏపీలో టీడీపీ మళ్ళీ నిలబడాలంటే ఎన్టీఆర్ రక తప్పేలా లేదని సీనియర్ రాజకీయ నాయకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కానీ ఇక్కడ అనేక రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ రాకను ఎంతవరకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాడు అన్నది ప్రశ్నగా మిగిలింది.

ఇప్పుడు ఏపీలో వైసీపీ టాప్ లో ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది వైసీపీనే. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ టీడీపీ పుంజుకోవాలంటే క్షేత్రస్థాయిలో ప్రతి వార్డ్ నుండి బలపరుచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  మరి ఎన్టీఆర్ వస్తారా ? వస్తే ఎప్పుడు వస్తారు ? రాజకీయ ప్రణాళికలు ఏమిటి అన్న పలు విషయాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: