
ఇలా పార్టీలో ఉన్నవాళ్లని పట్టించుకోకుండా ఉండటం వల్లే, ఇప్పుడు పార్టీ ఈ పరిస్తితుల్లో ఉందని బుచ్చయ్య బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే వాస్తవానికి చూస్తే గుడివాడ నియోజకవర్గంలో టీడీపీకి మొదట నుంచి రావి శోభనాద్రి కుటుంబం అండగా ఉంటూ వచ్చింది. పార్టీ పెట్టిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఎన్టీఆర్ గుడివాడ నుంచే పోటీ చేసి గెలిచారు.
ఆ తర్వాత నుంచి ఎన్టీఆర్, గుడివాడ బాధ్యతలు రావి కుటుంబానికి అప్పగించారు. ఆ ఫ్యామిలీనే గుడివాడలో పార్టీని నిలబెట్టింది. శోభనాద్రి, ఆయన కుమారుడు హరగోపాల్‌లు గుడివాడకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత శోభనాద్రి రెండో వారసుడు రావి వెంకటేశ్వరరావు పార్టీ కోసం పనిచేశారు.
కానీ 2004 ఎన్నికల్లో హరికృష్ణ కుటుంబం సిఫార్సు చేయడంతో చంద్రబాబు, రావిని సైడ్ చేసి కొడాలి నానిని గుడివాడలో తీసుకొచ్చి పెట్టారు. ఇక 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నాని, తర్వాత వైసీపీలోకి వెళ్లారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచి, టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు రావిని తీసుకొచ్చి పెట్టిన గుడివాడలో టీడీపీ బ్రతికే పరిస్తితి లేదు.
అటు వంశీ విషయంలో కూడా అంతే...గన్నవరంలో దాసరి బాలవర్ధనరావు ఫ్యామిలీకి పట్టున్న సరే, ఆ ఫ్యామిలీని కాదని 2014 ఎన్నికల్లో వంశీకి సీటు ఇచ్చారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన వంశీ, ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో గన్నవరంలో టీడీపీకి దిక్కు లేకుండా పోయింది. అంటే బాబు వేసిన రాంగ్ స్టెప్స్ వల్ల గుడివాడ, గన్నవరం నియోజవర్గాల్లో టీడీపీ పరిస్తితి దారుణంగా తయారైంది.