దసరా పండుగ నేపథ్యంలో తమ కష్టమర్లందరిని ఆకర్షించేందుకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. నవంబరు 7 వరకు కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఇటీవలే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకు వచ్చిన ఆఫర్ల ద్వారా రుణాలు పొందే వారి దగ్గర్నుంచి షాపింగ్ చేసే వారి వరకు ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంది. గోల్డ్ లోన్ వంటి టర్మ్ లోన్ పొందే వారికి ప్రాసెసింగ్ ఫీజు లో 100% మాఫీ కల్పిస్తున్నట్లు ఇటీవలే సంస్థ ప్రకటించింది. అంతేకాదు అగ్రికల్చర్ లోన్స్ పై ప్రాసెసింగ్ ఫీజు కూడా 0.2% పొందవచ్చు.
బిజినెస్ లోన్ తీసుకునే వారికి ఇక 0.5 శాతం కేసులు మాఫీ ఉంటుంది. వెహికల్ రుణాలు తీసుకోవాలి అనుకునేవారికి ప్రాసెసింగ్ ఫీజు లో 50% రిబేట్ లభిస్తోంది. అయితే ఇలా లోన్ లపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ తో పాటు అటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షాపింగ్ ధమాకా అనే ఒక సరికొత్త ఆఫర్ను కూడా తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా షాపింగ్, ట్రావెల్, డైనింగ్, హెల్త్ అండ్ వెల్ నెస్,ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ వంటి వాటిపై కూడా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు చెల్లింపుల ద్వారా ఆకర్షణీయమైన తగ్గింపులు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఈ ఫెస్టివల్ ఆఫర్ ని అందరూ ఆలస్యం చెయ్యకుండా వినియోగించుకోండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి