దేశంలోని పలు ప్రాంతాల్లో ఉపఎన్నికలు జరుగుతున్న విషయం విధిత‌మే.  తెలంగాణ‌లోని హుజూరాబాద్, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉపఎన్నిక‌లు అక్టోబ‌ర్ 30 నిర్వ‌హిస్తున్నారు. వీటితో పాటు దేశ వ్యాప్తంగా ఉప ఎన్నిక‌లు జ‌రిగే ప్రాంతాల్లో ప‌లు రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌ట‌న‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీర్‌య‌స్‌గా వ్య‌వ‌హ‌రించింది. ఎన్నిక‌లు జ‌రుగుతున్న నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌భావం చూపించేలా స‌మీపంలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం ఏంట‌ని ఈసీ అసంతృప్తి వ్య‌క్తం చేస్తోంది.
 
ఉపఎన్నిక‌లు నిర్వ‌హించే నియోజ‌క‌వ‌ర్గాలలో ఆ జిల్లా మొత్తం ఎన్నిక‌ల నియ‌మావ‌ళి వ‌ర్తించ‌నున్న‌ద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ స్ప‌ష్టం చేసింది. ప‌లు ప్రాంతాల్లో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిని క‌ఠినంగా అమలు చేయాల‌ని ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శుల‌ను ఆదేశించింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. రాష్ట్రానికి సంబంధించిన రాజ‌ధానులు, మెట్రోన‌గ‌రాలు త‌ప్ప మిగ‌తా అన్ని అసెంబ్లీ, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ఆ జిల్లావ్యాప్తంగా మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ అమ‌లులో ఉంటుంద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం వివ‌రించింది.

నియోజ‌క‌వ‌ర్గంలో బ‌య‌ట జిల్లా ప‌రిధిలో నిర్వ‌హించే ప‌లు కార్య‌క్ర‌మాల‌ను, ఖ‌ర్చుల‌ను మొత్తం ఆయా పార్టీల అభ్య‌ర్థుల ఎన్నిక‌ల ఖ‌ర్చులో భాగంగానే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. నియోజ‌క‌వ‌ర్గం ఉన్న‌ జిల్లా ప‌రిధిలో ఇలాంటి కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని  ప‌లు రాజ‌కీయ పార్టీల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం సూచించింది. ఇది ఇలా ఉండ‌గా తెలంగాణ‌లో ద‌ళిత బంధు బంద్ చేయాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఇటీవ‌ల ఆదేశాలు జారీ చేసిన విష‌యం విధిత‌మే. దీనిపై బీజేపీ నాయ‌కులు ఫిర్యాదు చేశార‌ని టీఆర్ఎస్ నాయ‌కులు విమ‌ర్శస్తున్నారు. ద‌ళిత బంధు ఆప‌డానికి కార‌ణం టీఆర్ఎస్ అని బీజేపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నారు. కాంగ్రెస్ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల‌పై విరుచుకుప‌డుతున్న‌ది. తాజాగా మ‌ల్లేప‌ల్లి ల‌క్ష్మ‌య్య ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను స‌వాలు చేస్తూ తెలంగాణ హై కోర్టులో పిల్ వేశారు.  ద‌ళిత‌బంధు ఇవ్వాల‌ని.. ఎన్నిక‌ల కోడ్‌కు ద‌ళిత‌బంధుకు సంబంధం లేద‌ని పేర్కొన్నారు.  మిగ‌తా ప‌థ‌కాలు అన్ని అమ‌లు అవుతున్నాయ‌ని, ద‌ళిత బంధు ఒక్క‌టి అమ‌లు చేయ‌క‌పోవ‌డం ఏమిట‌ని ఆయ‌న పిల్ వేశారు. దీనిపై కోర్టు తీర్పు త్వ‌ర‌లో ఇవ్వ‌నుంది. మొత్తానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌లు రాజ‌కీయ పార్టీల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ది.



మరింత సమాచారం తెలుసుకోండి: