తెలంగాణ‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతోన్న హుజూరా బాద్ బై పోల్ ప్ర‌చారం ముమ్మ‌రంగా జ‌రుగుతోంది. కాంగ్రెస్ - బీజేపీ - టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు ఇక్క డ పోటీ లో ఉన్నా కూడా ప్ర‌ధాన పోటీ మాత్రం బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ మ‌ధ్యే ఉంద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. టీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈటల ఒంటిరిగా పోరాడుతాడనుకున్న గులాబి నేతలకు షాక్ ఇస్తూ ఆయ‌న బీజేపీ లో చేరారు.

టీఆర్ ఎస్ అభ్య‌ర్థి కోసం వెతికి వెతికి చివ‌ర‌కు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ ను పోటీకి పెట్టింది. కాంగ్రెస్ కూడా విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్ ను తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఇక బీజేపీ నుంచి ఎన్నిచార్జ్‌లు ఉన్నా కూడా ప్ర‌ధానంగా ఈట‌ల ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. టీఆర్ ఎస్ నుంచి ఒక్కో గ్రామానికి ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఇన్ చార్జ్‌లుగా ఉన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి తన్నీరు హరీశ్‌రావు హుజురాబాద్ లోనే మ‌కాం వేసి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు.

అయితే ఇక్క‌డ గెలు పు ఓట‌ములు డిసైడ్ చేసేది మ‌హిళ‌లే. పురుష‌ల కంటే వారి ఓటింగే ప్ర‌ధానం. మ‌హిళ‌ల‌ను మెప్పించిన వారికే ఇక్క‌డ గెలుపు ద‌క్క‌నుంది. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పలు సర్వేలు చేస్తున్నా ఒక్కో స‌ర్వేలో బీజేపీ గెలుస్తుంద‌ని.. మ‌రో స‌ర్వేలో టీఆర్ ఎస్ గెలుస్తుంద‌ని తేలుతోంది. మ‌హిళ‌లు పురుషుల కంటే ఎక్కువ కావ‌డంతో వారి నాడిని ప‌ట్ట‌డం ఎవ్వ‌రి త‌రం కావ‌డం లేదు.

మ‌హిళ‌ల కోసం టీఆర్ ఎస్ వ‌రాల జ‌ల్లు కురిపిస్తోంది. భారీ ఎత్తున మ‌హిళా సంఘాల భ‌వ‌నాల‌కు నిధులు రిలీజ్ చేయ‌డం, వారికి ప్ర‌త్యేక ప్యాకేజీల వ‌ల వేయ‌డం చేస్తోంది. ఇక బీజేపీ నుంచి ఈట‌ల స‌తీమ‌ణి జమున కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరుగుతున్నారు. మ‌రి మ‌హిళా ఓట‌ర్లు ఎవ‌రిని క‌రుణిస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: