చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు అని చెప్పుకోవడానికి కాస్తయినా సిగ్గులేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి కన్నబాబు. రాష్ట్రం పరువు తియ్యాలి అనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలాంటి కొత్త డ్రామాలకు తెర లేపుతున్నాడు అంటూ విమర్శించారు మంత్రి కన్నబాబు . ఆంధ్ర ఒరిస్సా- బార్డర్ లో గంజాయి సాగు జరుగుతున్న విషయం దాదాపుగా అందరికీ తెలుసు. 1973లో చింతపల్లి గంజాయి కి సంబంధించి మొదటి కేసు నమోదైంది. అయితే టీడీపీ హయాంలో గంజాయి మాఫియా మరింత రెచ్చిపోయింది. విశాఖలో గంజాయి స్మగ్లింగ్ పెరిగిపోయిందని ఆ సమయంలో టిడిపిమంత్రులే చెప్పిన విషయం మరిచిపోయారా అంటూ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు.
చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా గంజాయి మాఫియాను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అంటూ ప్రశ్నించారు. కానీ వైసీపీ అధినేత జగన్ సీఎం అయిన తర్వాత సెబ్ ద్వారా గంజాయి పై ఉక్కుపాదం మోపి గంజాయి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. రెండున్నరేళ్లలో తమ ప్రభుత్వం ఏకంగా మూడు లక్షల కేజీల గంజాయి పట్టుకుంది. 5 వేల మందిని అరెస్టు చేసి కేసులు పెట్టింది అని తెలిపారు మంత్రి కన్నబాబు. గంజాయిని సీఎం జగన్ ఆషామాషీ వ్యవహారం గా చూడటం లేదని చాలా కఠినంగానే ముందుకు సాగుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు మంత్రి కన్నబాబు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి