ఈ దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ ఎవరు..? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం అంత సులభమేమీ కాదు. దేశంలోని అనేక రంగాల్లో పని చేస్తున్న మహిళలను గుర్తించి.. వారిలో అత్యుత్తమంగా పని చేసిన వారిని ఎంపిక చేయడం చిన్న విషయమేమీ కాదు. కానీ.. ఫార్చూన్ ఇండియా వారు ఇలాంటి సర్వేలు తరచూ చేస్తుంటారు. విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తుంటారు. ఆ ఫార్చూన్ ఇండియా సంస్థ చెబుతున్న లెక్కల ప్రకారం.. ఈ దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ ఎవరో తెలుసా.. ఆమే దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. ఈమే జాబితాలోనే  అగ్రస్థానంలో నిలిచారు.


ఇక సెకండ్ పొజిషన్ ఎవరిది అంటారా.. ఫార్చున్‌ ఇండియా విడుదల చేసిన ఈ జాబితాలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్స్‌న్‌ నీతా అంబానీ సెకండ్ ప్లేస్ కొట్టేశారు. ఇక వీరిద్దరూ కాకుండా ఇంకా చాలామంది మహిళలు ఈ టైటిల్ కోసం పోటీపడ్డారు.  డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌తో పాటు పలువురు స్థానిక మహిళలు ఈ టైటిళ్ల కోసం పోటీ పడ్డారు. ఇక ఆ తర్వాత స్థాయి వారిలో బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్ మజూందర్‌ షా, భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకులు, జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్ల కూడా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


మరి ఎందుకు నిర్మలా సీతారామన్ ఫస్ట్ ప్లేస్ సాధించారంటే.. కొవిడ్‌ మహమ్మారి వంటి క్లిష్ట సమయంలో దేశ ఆర్థిక మంత్రిగా ఆమె సేవలందించారు. ప్రత్యేకంచి లాక్‌డౌన్‌ సమయంలో  ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఆత్మనిర్భర భారత్‌ లోని ఎంఎస్‌ఏఈల ద్వారా చేయూత అందించడం..., ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వంటి చర్యలు నిర్మలా సీతారామన్ ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. అదే సమయంలో రిలయన్స్ ఫౌండేష్ ద్వారా ముకేశ్ సతీమణి  నీతా అంబాని కూడా పలు ఆస్పత్రులు, కొవిడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు సహకరించారు. ఆక్సిజన్‌ సరఫరా, పీపీఈ కిట్స్‌ తయారీ వంటి కార్యక్రమాలను రిలయన్స్‌ ఫౌండేషన్‌ ద్వారా నీతా అంబానీ చేపట్టారని అంతా మెచ్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: