నాయకుడు అనే వారికి ఇప్పుడు కూడా ఇగో ఉండకూడదు. అస‌లు ఇగో ఉన్న వారు రాజ‌కీయాల్లో ఎక్కువ కాలం రాణించ లేరు. అంతా తనకే తెలుసు అన్న అహం నాయ‌కుడికి ఎప్పుడూ వుండకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ లక్షణాలు అన్నీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కు పుష్కలంగా ఉంటాయి. రోశ‌య్య ఎంతోమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి - కోట్ల విజయభాస్కర్ రెడ్డి - టి అంజయ్య - నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి - వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రుల మ‌న్న‌న‌లు ఆయ‌న పొందారు. అయితే వీరందరిలోనూ వైయస్ రాజశేఖర్ రెడ్డి తో రోశ‌య్య‌కు విడదీయలేని అనుబంధం ఉందని చెప్పాలి.

వీరిద్దరూ కూడా ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారే. వీరు సొంత కష్టాన్ని నమ్ముకుని నాయకులు అయ్యారు. వైయస్ అయితే ఎన్నో అవమానాలు ఎదుర్కొని ... ఎన్నో ఇబ్బందులు పడి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన మరణానంతరం కాంగ్రెస్ అధిష్ఠానానికి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న రోశయ్య కూడా ముఖ్యమంత్రిగా పని చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నప్పుడే రోశ‌య్య ఆర్థిక మంత్రిగా ఉన్నారు. వైఎస్ ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ఖజానా ఖాళీగా ఉండకుండా చూడటంలో రోశ‌య్య చాతుర్యం ఎంతో పనిచేసేది.

అటు వైఎస్ కూడా రోశ‌య్య అంటే ఎంతో అపారమైన నమ్మకం కలిగి ఉండేవారు. రోశ‌య్య మాట కాస్త ఘాటుగా ఉన్న ఆయన మనసు వెన్న అని చెబుతూ ఉంటారు. ఆయ‌న పై ముఖ్య‌మంత్రుల‌కు ఉన్న ఆ న‌మ్మ‌కంతోనే ఆయ‌న‌ ఏకంగా పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు . ఇందిరా గాంధీ - రాజీవ్ గాంధీ - సోనియా గాంధీ లాంటి అగ్రనేతలతో ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది.

రాజశేఖర్ రెడ్డిని రోశ‌య్య రాజశేఖర్ అని ఎంతో ఆప్యాయంగా పిలిస్తే .. వైఎస్ఆర్ మాత్రం చెప్పండి అన్నా అని పిలిచేవారు. వారిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉండేది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: