బర్త్ డే బోయ్ : సల్లంగుండాలే! సక్కంగుండాలే !
స్థానికంగా నాయకులు అంతా జగన్ ను పొగిడి పార్టీని పాడుచేస్తున్నారు. తిట్లు లేదా బూతులు మా ప్రాంత నాయకులు పెద్దగా వాడరు కానీ ఓ సందర్భాన దాసన్న మాత్రం నోరు జారారు. అది చాలా తప్పు..అలాంటివి ఒప్పుకోకూడదు కూడా! స్పీడులో మంత్రి సీదిరి బాగున్నారు కానీ ఆయన కూడా నిధుల లేమి కారణంగా ఏ పనీ పరిపూర్ణం చేయలేకపోతున్నారు. కొత్త జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ కూడా నేర్చుకోవాల్సింది ఎంతో! కారుణ్య నియామకాలు ఇటీవలే చేపట్టారు కానీ ఆ సంద ర్భంలో కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం కూడా సమంజసం కానీ ఏకీభావంలో లేని విషయమే! కనుక ఇవన్నీ పరిష్కృ తాలు అయితే మేలు..మా ఊరి ఎమ్మెల్యే క్షేత్ర స్థాయిలో తిరగడం లేదు. ఆయన నరసన్నపేట రాజకీయాలపై మనసు మరియు బుద్ధి కేంద్రీకృతం చేయడం తగని పని! ఆయన ఇంటి పేరు : ధర్మాన పూర్తి పేరు : ధర్మాన ప్రసాదరావు. ఇక పాతపట్నం రాజకీ యాల్లో పెద్దగా మార్పులు ఏమీ లేవు. మా ఊరికి కాస్త దూరం నీలమణి దుర్గ ఆలయం ఉన్న ప్రాంతం. రెడ్డి శాంతి మేడమ్ పట్టిం చుకోని ప్రాంతం.. ఆమెనే ఈ ప్రాంత ఎమ్మెల్యే.. ఆమెకే పట్టింపూ లేని ప్రాంతం కూడా ఇదే! ఎచ్చెర్ల, రాజాం అన్నవి రియల్ వెంచ ర్లకు అడ్డా కనుక ఆ ప్రాంత ఎమ్మెల్యేల ఊసు గురించి చెప్పకపోవడం కన్నా తెలియదు అని తప్పుకుపోవడం బెటర్.. ఇది సర్ మా జిల్లా..డిప్యూటీ సీఎం ఉన్న నరసన్నపేట (ధర్మాన కృష్ణదాసు) నియోజకవర్గం కూడా అనేక ఆరోపణలకు అడ్డా! చెప్పుకుం టూ పోతే మీ పుట్టిన్రోజున ఎన్నో! ఒక్కసారి మా జిల్లాకు సంక్రాంతి తరువాత రండి. నా లాంటి సామాన్యులతో మాట్లాడండి..అందరి కథలూ తప్పక వివరించే బాధ్యత నాదే! రావాలి జగన్ కావాలి జగన్ అన్న స్లోగన్ విన్నంతగా ఇవాళ పాలన బాలేదు. మా ఊరికి జగన్ చేసిందేమీ లేదు అని తేలిపోయింది. మా ఊరికీ మా వీధికీ ప్రస్తుతం వైసీపీ చేయాలనుకుంటున్నదేదీ ఒక కొలిక్కి రాలేదు. ఆయన మా వంశధారకు నిధులు లేవు అని అంటున్నారు. ఫేజ్ 2 పనులకు కాల్వల నిర్వహణకు డబ్బులు ఇవ్వడం అంటే అదొక భారం ఆయనకు. ఇక తోటపాలెం ప్రా జెక్టుకు కాస్త నిధులు ఇచ్చి చేతులు దులుపుకునిపోవడం సమంజసం కాదు. అదేవిధంగా పక్క రాష్ట్రం ఒడిశాతో తగవు లేదా క య్యం ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు రాదు కూడా! కనుక జగన్ సర్ మా ఊరికి చేసింది కానీ మా శ్రీకాకుళం నగరికి చేసింది కానీ ఏ మీ లేదు. ఇంకా నాయకులు స్థానిక నాయకులు మాత్రం ఆయనను పొగిడే పని కూడా మానుకోవాలి. ఎందుకంటే భజన కారణం గా చంద్రబాబు ఇంటికి ఎలా పరిమితం అయి ఉన్నారో మీరు కూడా మీ నోరు కూడా అలానే రేపటి వేళ కొద్ది పాటి వ్యక్తులకే పరిమి తం అయ్యే ఛాన్స్ ఉంది. మా ఊళ్లో వైసీపీ మళ్లీ గెలుస్తుంది అని అనుకోను. ఎందుకంటే రెండు కిలోమీటర్ల పరిధి మేర ఓ రోడ్డు వే యని వేయలేని అసక్తత ఆయనిది. పండుగ రోజు పుట్టిన్రోజు ఒక్కటే అని నిర్థారణకు రావాలి. దేశం గర్వించే పనులు రాష్ట్రం గర్వించే పనులు మా ఊరు గర్వించే పను లు కొన్ని చేయాలి ఎవ్వరయినా! పాద యాత్ర తో మంచి పేరు తెచ్చుకున్న ఆయన తరువాత కాలంలో ఆశించిన గెలుపును అం దుకున్న ఆయన తరువాత కాలంలో మాత్రం ఆశించిన విధంగా పేరు తెచ్చుకో కపోవడం ఓ విచారకర సందర్భం. పుట్టిన్రోజున జగ న్ చేయాల్సిన పనులు చెప్పాలి. చేయకూడని పనులకు చెక్ చెప్పాలి. ఈ విధంగా చెప్పడంలో అర్థం కన్నా బాధ్యత ఎక్కువ ఉం ది. అర్థం కేవలం కొన్నింటికే పరిమితం కానీ బాధ్యత అన్నింటికీ అన్ని వేళలా అనువర్తితం అని నిర్థారించాలి. ముఖ్యమంత్రి హోదాలో రెండున్నరేళ్ల పూర్తి అన్నది ఆయనకు ఆనందం ఇచ్చే సమయం. ఇదే సందర్భాన ఆయన సాధించిన లే దా సాధించేందుకు వీలున్నవన్నీ అవలోకన చేసుకోవాల్సిన సమయం. వైఎస్ జగన్ కొన్ని అవరోధాలు దాటి చేస్తున్న పాలన కారణంగా ఆయనకు మంచి పేరు రావొచ్చు. లేదా మంచి పేరు వచ్చేందుకు అడ్డంకులు ఉంటే అవి కూడా ఓ విధంగా కొన్ని పద్ధతు ల్లో తొలగవచ్చు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా శాసిస్తున్నారు అన్నదే ఓ ప్రధాన విషయం. ముఖ్యమంత్రిగా ఆయన సాధించిన వాటిలో చాలా కొద్దిపాటి ఫలితాలే ఆశించిన విధంగా ఉన్నాయి. డబ్బులు పంచడంలో పథకాలు పంచడంలో పెద్దగా ఆయన పేరు తెచ్చుకున్నది ఏమీ లేదనే తేలిపోయింది. అయినా కూడా ఆయన అప్పులు చేసి నెత్తిన భారం మోపీ అందరినీ కాస్త కాదు ఇంకొంచెం ఎక్కువే రేపటి వేళ ఇబ్బంది పెట్టనున్నారు. ఈ విధంగా అనేందుకు తార్కాణం ఒక్కొక్కరి నెత్తిపై ఉన్న నాలుగున్నర నుంచి ఐదు లక్షల అప్పే! ఎనీవే హ్యాపీ బర్త్ డే సర్
- రత్నకిశోర్ శంభుమహంతి