దెయ్యం సినిమాల ఆర్జీవీ మరో సంచలనానికి కేరాఫ్ అయ్యాడు.చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై మంత్రి పేర్నినానితో మాట్లాడేందుకు సిద్ధం అంటూ చెప్పి,నిన్న వెళ్లి కలిసివచ్చాడు.కానీ ఈ చర్చల ద్వారా ఆర్జీవీ సాధించింది సున్నా.అదే విషయం ఆయన కూడా చెప్పకనే చెప్పాడు.అనేక అభిప్రాయాలు విన్నాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని,ఇండస్ట్రీ అంటే తానొక్కడినే కాదన్నాడు. ఇక తాను కేవలం ప్రొడక్ట్ ను అమ్ముకునే వారిని మీరెలా నియంత్రిస్తారు అనే విషయమై మాత్రమే ఓ క్లారిటీ ఇచ్చానని, తన ప్రశ్నను విపులీకరించేందుకు మాత్రమే వచ్చానని చెప్పాడు.సమాధానాలు వినేందుకు వెళ్లలేదని అన్నాడు. అంటే సమాధానాలు వినే ఓపిక లేకప్పుడు లేదా ఆ ఇష్టమో శ్రద్ధో లేనప్పుడు చర్చలకు వెళ్లడం ఎందుకు?
చర్చలంటే ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు..ఇవాళ తెలుగు చిత్ర సీమ ఎదుర్కొంటున్న పరిణామాలపై కూలంకుషంగా మాట్లాడడం.
ఎప్పటి నుంచో సినిమా టికెట్ ధరలకు సంబంధించి వివాదం ఉన్నా కూడా పేర్నినాని చెప్పే ప్రతి మాట అమూల్యం అనుకుని ఇండస్ట్రీ వింటూ వస్తోంది.కరోనా విజృంభణ వేళ ఇకపై మూడు షోలకు మాత్రమే అనుమతి ఇస్తోంది. ఇది కూడా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే! ఈ దశలో హీరోలు మాట్లాడాలి కానీ మాట్లాడడం లేదు.ఇలాంటి నిరాశపూరిత వాతావరణం నుంచి బయటకు వచ్చేలా ఆర్జీవీ ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేసి ఓ పెద్ద నాటకమే నడిపాడు.వాస్తవానికి ఆయన వైసీపీ దూతలానే ఉన్నారు తప్ప ప్రభుత్వం తరఫున మాట్లాడేందుకు ఇష్టపడ్డారే తప్ప సాధించింది ఏమీ లేదు.అది మీ ఖర్మ నేను చెప్పాల్సింది చెప్పాను అని ఎప్పుడూ అన్న మాదిరిగానే తాను చెప్పాలనుకున్నది చెప్పి అవతలి నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు అందుకోకుండానే,ఫక్తు జగన్ మనిషి మాదిరిగా మీడియా ముందు మాట్లాడడంతో ఈ సమస్య నిన్నటి చర్యలతో చర్చలతో ఏ కొద్దిపాటి పరిష్కారాన్నీ పొందలేకపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి