
ఇక కేరళ రాష్ట్రంలో కూడా బీజేపీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 113 స్థానాల్లో పోటీ చేసిన కాషాయ పార్టీ... సున్నా దగ్గరే ఆగిపోయింది. చివరికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మ్యాన్‌ను ముందుగానే ప్రకటించింది. అయినా సరే... ఆయన కూడా విజయం సాధించలేదు. ఇక 2021 ఏప్రిల్ నెలలో జరిగిన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాటి అధికార అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంది. అమిషా వంటి నేతలు ప్రచారం కూడా చేశారు. పొత్తులో భాగంగా 20 స్థానాల్లో పోటీ చేశారు కమలం పార్టీల అభ్యర్థులు. అందులో కేవలం నాలుగే స్థానాలతో సరిపెట్టుకుంది. అది కూడా అన్నాడీఎంకే పొత్తు వల్ల మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు వెల్లడించారు. ఇక అధికారమే లక్ష్యంగా 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ... చివరికి కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటు సాధించింది. మొత్తం 117 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేయగా... కేవలం రాజాసింగ్ మాత్రమే విజయం సాధించారు. చివరికి కిషన్ రెడ్డి లాంటి బడా నేతలు కూడా ఓడిపోయారు. నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 407 స్థానాల్లో పోటీ చేసిన కమలం పార్టీ కేవలం 5 చోట్ల మాత్రం గెలిచింది. పరిస్థితి ఇలాగే ఉంటే... కమలం పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందో మరి.