అంతరిక్షం అనేది ఎన్నో అంతుపట్టని అద్భుతాలకు నిలయం. అక్కడ జరిగే ప్రతిదీ కూడా భూమి పైన ఉండే మానవులకు ఎంతో ఆశ్చర్యంగానే ఉంటాయి. అందుకే విశ్వంలో ఉండే చాలా రహస్యాలను ఛేదించాలని ఎప్పటికప్పుడు కూడా కొత్త ప్రయోగాలను చేస్తుంటారు.ఇలా చేసిన ప్రయోగాలు కొన్ని గనుక విజయవంతం అయితే మరి కొన్ని మాత్రం విఫలం అయిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలా విఫలం అయినవి కొన్నింటిని భూమి పైన ఉండే సముద్రాల్లో పడేస్తే.. కంట్రోల్ తప్పిపోయనవి కొన్ని అంతరిక్షంలో వ్యర్థ పదార్థాలుగా మిగిలిపోవడం జరుగుతుంది. ఇలా అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోయిందని శాస్త్రవేత్తలు అందరూ కూడా భావించిన ఓ రాకెట్ అకస్మాత్తుగా ఓ ఉపగ్రహం వైపుకు దూసుకు వస్తోంది.ఇక అదే ప్రపంచపు అగ్ర కుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన అంతరిక్ష కంపెనీ స్పేస్ ఎక్స్ తయారు చేసి ప్రయోగించిన ఫాల్కన్ 9. ఈ రాకెట్ ను ఏడు సంవత్సరాల క్రితం అంటే 2015లో ఈ సంస్థ ప్రయోగించింది. అయితే ఈ రాకెట్ సక్సెస్ కాలేకపోయింది. మొదట అందరూ అనుకున్నట్లుగా మొదటి దశ విజయవంతం అయినా కానీ తరువాత రెండో దశలో ఈ రాకెట్ ఫెయిల్ అయ్యింది. దాని మీద కమాండ్ సాధించేందుకు శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా కాని చివరకు లాభం లేకుండా పోయింది.

దీంతో ఆ కంపెనీకి సంబంధించి పరిశోధకులు నిపుణులు అందరూ అంతరిక్షంలో వ్యర్థంగా మిగిలిపోయిందని భావించారు. అయితే నాటి నుంచి కూడా ఈ ఫాల్కన్ 9 బూస్టర్ ఇక ఒక క్రమ సాలు అనేది లేకుండా చాలా కక్ష్యల్లో పరిభ్రమిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ దారికి వచ్చినట్లు పరిశోధకులు కూడా చెప్తున్నారు. అయితే ఈ రాకెట్ ఇక ఢీ కొట్టబోయే ఉపగ్రహం మరేదో కాదట. అది ఢీ కొట్టబోయేది భూమి ఉపగ్రహంగా ఉన్న చంద్రుడ్ని. అయితే ఇలాంటివి చాలా అరుదైన ఘటనలు గా మనం చెప్పుకోవచ్చు. అందుకే దీనిని పూర్తి స్థాయిలో పరిశీలించబోతున్నాయి చాలా స్పేస్ కంపెనీలు కూడా. ఈ ఫాల్కన్ సుమారు రెండు నెలలు తరువాత చంద్రుడ్ని ఢీ కొట్టనున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సుమారు ఏడు సంవత్సరాల తరువాత వస్తున్న ఈ గండం అమెరికా పరిశోధన సంస్థ నాసా గుర్తించడం జరిగింది. అయితే నాసా చెప్తున్న దాని ప్రకారం ఈ ఇది మార్చి నాలుగో తేదీన చంద్రున్ని ఢీ కొట్టబోతుంది. అయితే దాదాపు నాలుగు వేల కేజీలకు పైగా ఉన్న ఊ స్పేస్ ఎక్స్ ప్రయోగించిన ఫాల్కన్ గంటకు సుమారు 9 వేల కిలో మీటర్లకు పైగా వేగంతో వడివడిగా చంద్రుని వైపు దూసుకుపోతుందని పరిశోధకులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: