ఆమధ్య పీఆర్సీ సాధన సమితిపై ఆరోపణలు వచ్చినప్పుడు.. వారు కూడా ఉపాధ్యాయ సంఘాలను కొన్ని ప్రశ్నలు అడిగారు. పీఆర్సీ విషయంలో తమ పోరాటం నచ్చనప్పుడు ఉపాధ్యాయులు సమ్మెలోకి వెళ్లొచ్చుకదా అని ప్రశ్నించారు. అప్పటికే ఉద్యోగ సంఘాలన్నీ సమ్మె నోటీసు ఇచ్చాయి. చర్చలు సఫలం అయ్యాయంటూ పీఆర్సీ సాధన సమితి వెనకడుగు వేసింది. కానీ ఇప్పటికే సమ్మె నోటీసు అలాగే ఉంది. సాధన సమితిని పక్కనపెట్టి.. మిగతా ఉపాధ్యాయ సంఘాలు సమ్మెలోకి వెళ్లే అవకాశం ఉంది. కానీ వారు కూడా వెనక్కి తగ్గారు.
ఇటీవల సమ్మె విషయంలో సీఎం జగన్ కూడా ఉపాధ్యాయుల తీరుని పరోక్షంగా విమర్శించారు. ఇప్పటికే కరోనా వల్ల రెండేళ్లపాటు విద్యార్థులు నష్టపోయారని, ఇప్పుడు పరీక్షలకు సమయం దగ్గరపడుతోందని, ఈ దశలో ఉపాధ్యాయులు రోడ్డెక్కడం ఎవరికి లాభం అని ప్రశ్నించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈ విషయంలో ఏమని సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు జగన్. దీంతో ఉపాద్యాయులు కూడా ఈ సమయంలో సమ్మెకు వెళ్లడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వాన్ని బతిమాలో, బెదిరించో పీఆర్సీ విషయంలో కాస్త పెంపు ఆశిస్తున్నారు. గతంలో ఐఆర్ ప్రకటించినట్టుగా ఫిట్ మెంట్ ని 27శాతం ప్రకటించాలని అడుగుతున్నారు. మరి ప్రభుత్వం ఇలాంటి సుతి మెత్తని బెదిరింపులకు భయపడుతుందా లేదా అనేది చూడాలి. ఇప్పటివరకైతే ప్రభుత్వం ఫిట్ మెంట్ విషయంలో కచ్చితంగా ఉంది, పెంచేది లేదని తెగేసి చెప్పింది. ఉద్యోగ సంఘాలకు కూడా అదే విషయంలో నచ్చజెప్పి సమ్మెకు వెళ్లకుండా విరమింపజేసింది. ఇప్పుడు ఉపాధ్యాయుు సమ్మె లేకుండా చేస్తున్న నిరసనలను ప్రభుత్వ పెద్దలు పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి