తెలంగాణకు గతంలో ఇన్ని ఎక్కువ అవార్డులు ఎప్పుడూ రాలేదని.. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఒక్క అవార్డు మాత్రమే వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరవాత ఐదు అవార్డులు వచ్చాయని. ఆ తర్వాత క్రమంగా అవార్డులు పెరిగిపోతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్నారు. అయితే.. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధులకు కొర్రీలు పెడుతోందని.. గతంలో నెలకు రూ.300 కోట్ల నిధులు ఇచ్చేవారని.. కానీ ఇప్పుడు కేవలం రూ.237 కోట్లు మాత్రమే ఇస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.
కేంద్రం నుంచి వచ్చే అన్ని నిధులను కుదించారన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తెలంగాణ లో విష జ్వరాలు తగ్గాయని, ఫ్లోరైడ్ తగ్గిందని కేంద్రమే వెల్లడించిందని గుర్తు చేశారు. అలాగే ఈ.జీ.ఎస్ నిధులను సక్రమంగా వినియోగించుకుంటున్నామని.. 20వ తేదీ నుంచి పల్లెప్రగతి ప్రారంభమై 15రోజుల వరకు కొనసాగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు. ఈ కార్యక్రమాన్ని అందరూ సమిష్టిగా కృషిచేసి సక్సెస్ చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు ఇచ్చారు.
అవార్డు గ్రహితలకు అవార్డులను అందజేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ప్రస్తుతం మన ఊరు మన బడి కార్యక్రమం కింద రూ.7వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. బడులు బాగు పడితే...గ్రామాలను వదిలిపెట్టి ఎవ్వరూ వెళ్ళరన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. అందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి