గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఈరోజు ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ రేటు తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సిలిండర్ ధర భారీగా తగ్గింది. రేట్ల తగ్గింపు నిర్ణయం ఈరోజు నుంచే అమలులో కి వచ్చింది. జూలై 1 నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 198 దిగొచ్చింది.


ప్రాంతం ప్రాతిపదికన సిలిండర్ రేటు తగ్గింపులో కొంత వ్యత్యాసం ఉండొచ్చు. అయితే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. ధరలో ఎలాంటి మార్పు లేదు. మే 19 నాటి ధరలే కొనసాగుతూ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ సిలిండర్ బుక్ చేయాలంటే రూ. 1050 వరకూ చెల్లించాలి.


నేటి నుంచి తగ్గిన ధరలను గమనిస్తే.. ఢిల్లీలో ఈ సిలిండర్ రేటు రూ. 2021గా ఉంది. కోల్‌కతా లో ఈ సిలిండర్ కొనాలంటే రూ. 2140 చెల్లించుకోవాలి. ముంబై లో అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1981 వద్ద ఉంది. చెన్నై లో ఈ సిలిండర్ రేటు రూ. 2186 కు చేరింది. జూన్ నెల లో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. మొత్తానికి రూ.135 మేర తగ్గింది.మే 7న సిలిండర్ ధర రూ. 50 పైకి చేరింది. అలాగే మే 29 సిలిండర్ రేటు మళ్లీ రూ. 4 మేర పెరిగింది. ఇలా రెండు సార్లు ధరలు పెరిగాయి. గత ఏడాది కాలం లో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 834 నుంచి రూ. 1003 కు చేరింది.. ప్రస్తుతం తగ్గిన ధరలు జనాలకు ఊరటనిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే నేడు ధరలు కిందకు దిగి వచ్చాయని తెలుస్తుంది. ఇదే ధరలు మార్కెట్ లో కొనసాగుతాయా..పెరుగుతాయా అనేది చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: